A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
లా పరీక్ష రాసిన ఎమ్మెల్యే జీవన్ రెడ్డి
Share |
February 19 2019, 7:41 am

రెండోసారి ఎమ్మెల్యేగా గెలుపొందిన ఎ.జీవన్ రెడ్డి ఇప్పుడు న్యాయ శాస్త్రంలో పరీక్షలకు హాజరయ్యారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూరు నుంచి గెలుపొందిన జీవన్ రెడ్డి
న్యాయశాస్త్రాన్ని అభ్యసిస్తూ.. క్రమం తప్పకుండా సెమిస్టర్‌ పరీక్షలకు హాజరవుతున్నారు. ఆయన హన్మకొండ సుబేదారిలోని యూనివర్సిటీ కాలేజీ ఆఫ్‌ లాలో పరీక్షలు రాశారు. హన్మకొండలోని ఆదర్శ్‌ లా కాలేజీలో జీవన్‌రెడ్డి ఎల్‌ఎల్‌ఎం అభ్యసిస్తున్నారు.
ఆయన ప్రస్తుతం మూడో సెమిస్టర్‌ పరీక్షలకు హాజరవుతున్నారు. గత ఏడాది రెండు సెమిస్టర్‌ పరీక్షలు రాసి పాసయ్యానని, ఈ రోజు మూడో సెమిస్టర్‌ పరీక్షలకు హాజరయ్యానని తెలిపారు.

tags : jeevanreddy, llm

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info