A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
మోడీ కుటుంబం ఉంటే తెలిసేదన్న బాబు...
Share |
August 21 2019, 6:37 am

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి కుటుంబం ఉంటే దాని విలువ తెలిసేదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు.డిల్లీలో ధర్నా చేస్తున్న సందర్భంగా మాట్లాడారు. సొంతపార్టీ బిజెపిలో కూడా కూడా మోదీ గొడవలు పెట్టారని ఆయన అన్నారు. తాము కూడా వ్యక్తిగత దాడి మొదలుపెడితే ఆయన ముఖం ఎక్కడ పెట్టుకుంటారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. మోదీ, అమిత్‌షా కలిసి దేశంలోని వ్యవస్థలను నాశనం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజల్ని ఇబ్బంది పెట్టి ఆనందపడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశాన్ని కాపాడుకోవాలనే తమ ఆశయ సాధనలో రాజీ లేదని ఆయన పేర్కొన్నారు. ఎపికి ప్రత్యేక హోదా ఇస్తామని మోసం చేశారని చంద్రబాబు విమర్శించారు.చంద్రబాబు ప్రదాని మోడీని విమర్శించడం బాగానే ఉన్నా,మరి ఆయన పక్కన కూర్చున్న రాహుల్ గాందీకి కూడా కుటుంబం లేదు కదా!

tags : babu, modi, family

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info