A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
అక్రమ కేసులన్నిటిని ఎత్తివేస్తాం- జగన్
Share |
February 19 2019, 8:23 am

వైఎస్ ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలపై రాష్ట్రంలో అక్రమ కేసులు పెట్టారని విపక్ష నేత ,వైఎస్ ఆర్ కాంగ్రెస్ అదినేత జగన్ ఆరోపించారు. అనంతపురం లో భారీ ఎత్తున జరిగిన బూత్ కమిటీల సభ్యుల సమావేశంలో ఆయన ప్రసంగించారు. ఈ తొమ్మిదేళ్లు వైఎస్ ఆర్ కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు చాలా కష్టాలు పడ్డారని, చివరికి కుటుంబ సభ్యులను కూడా కోల్పోయిన వారు ఉన్నారని ఆయన అన్నారు. ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులన్నిటిని వైఎస్ ఆర్ కాంగ్రెస్ అదికారంలోకి రాగానే ఎత్తివేయడం జరుగుతుందని అన్నారు. సుమారు 1200 కేసులుపైగా అక్రమంగా పెట్టారని ఆయన అన్నారు. సంక్షేమ పధకాలు ప్రతి ఒక్కరికి, కులం, మతం, వర్గం, ప్రాంతం వివక్ష లేకుండా అందించాలని ఆయన అన్నారు.పార్టీని అదికారంలోకి తీసుకు రావల్సి న బాద్యత అందరి భుజస్కందాలపై ఉందని జగన్ అన్నారు.

tags : jagan, illegal cases

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info