A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
jకాపులు బిసిలా?అగ్రవర్ణాలా-కామెంట్
Share |
August 21 2019, 5:50 am

రాజ్యాంగాన్ని ,చట్టాలను ఎపి ప్రభుత్వం ఒక ప్రహసంగా మార్చుతోంది.నియమ నిబంధనలతో నిమిత్తం లేకుండా, తమ ఇష్టం వచ్చినట్లు బిల్లులను,తీర్మానాలను పాస్ చేసి, చేతులు దులుపుకోవడమే కర్తవ్యంగా పెట్టుకున్నట్లు కనిపిస్తుంది.తాజాగా అందుకు ఉదాహరణ కాపు సామాజికవర్గం వారికి అగ్రవర్ణ పేదల రిజర్వేషన్ లలో ఐదు శాతం కేటాయించుతూ అసెంబ్లీ బిల్లును ఆమోదించడమే.సాధారణంగా అయితే ఈ చర్యకు అబినందించవచ్చు. కాని కాపులను మోసం చేయడానికి చేసిన ప్రయత్నంగా ఇది తయారవడంతో దీనిని అభిశంసించాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొద్ది నెలల క్రిందట చంద్రబాబు నాయుడు కాపులను బిసిలలో చేర్చుతూ బిల్లు పెట్టి ,దానిని ఆమోదించి కేంద్రానికి పంపించారు. దానికి అతీ గతీ లేదు.అప్పట్లో కాపుల రిజర్వేషన్ బిల్లు ఆమోదించిన తీరు కూడా వివాదాస్పదం అయింది.బిసి కమిషన్ చైర్మన్ తో సంబందం లేకుండా, కొందరు సభ్యులతో రిపోర్టు రాయించుకుని హడావుడిగా బిల్లు ఆమోదించి కేంద్రానికి పంపారు. అది ఆమోదం పొందదన్న సంగతి అప్పుడు చంద్రబాబు కు తెలుసు.కాపు మంత్రులకు తెలుసు. ఆ విషయాన్ని కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం కాని, ఇతర కాపు నేతలు కాని గట్టిగానే చెప్పారు. అయినా చంద్రబాబు అప్పట్లో కాపు మంత్రులతో సన్మానాలు కూడా చేయించుకున్నారు. కాపులను బిసిలుగా చేసేశామ ని ప్రచారం చేసుకున్నారు. కాని ఇంతవరకు కాపులకు బిసి సర్టిఫికెట్ల్ ఇవ్వడం లేదట. అందుకు అనుగుఃణంగా ఉత్తర్వులే ఇవ్వలేదట. అదంతా ఒక మోసపూరిత ప్రక్రియగా ఉంటే, తాజాగా చేసిన రిజర్వేషన్ బిల్లు మరింత మోసం పూరితంగా ఉంది. కేంద్రంలో మోడీ ప్రభుత్వం దేశ వ్యాప్తంగా అగ్రవర్ణ పేదలకు పది శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాజ్యాంగ సవరణ చేసింది.అందులో ఎక్కడా అగ్రవర్ణ కులాల మద్య ఎంతెంత శాతం ఇవ్వవచ్చో అన్న విషయం ప్రస్తావించలేదు. ఎవరు పేదలైతే వారికి అది అమలు అవుతుంది.అది రాజ్యాంగ సవరణ కాబట్టి ,రాష్ట్రాలు వాటి ఇష్టం వచ్చినట్లు చేసుకోవడానికి ఉండదని న్యాయ నిపుణులు చెబుతున్నారు.అయినా అడ్డగోలుగా అందులో ఐదుశాతం కోటాను ఇస్తూ బిల్లును ఆమోదించినట్లు ప్రకటించింది.దీని గురించి నిలదీయవలసిన అదికార పార్టీ సభ్యులుమౌనం దా్చడం ద్వారా కాపు సమాజానకి వీరు ద్రోహం చేస్తున్నారన్న విమర్శలు ఎదుర్కుంటున్నారు.గతసారి బిసిలలో కలిపినందుకు చంద్రబాబు కు సన్మానాలు చేశారు. మరి ఈసారి మళ్లీ కాపులను అగ్రవర్ణాలలోకి తెచ్చినందుకు ఎందుకు సన్మానాలు చేయలేదో తెలియదు. ఇంతకీ కాపులను చంద్రబాబు నాయుడుకాని, ఆయన ప్రభుత్వం కాని వెనుకబడిన వర్గం కింద చూస్తారా?లేక అగ్రవర్ణాల కింద చూస్తారా?ఒకసారి బిసిలుగా బిల్లు పెట్టి ఆమోదించిన తర్వాత దానిని రద్దు చేయకుండా మళ్లీ అగ్రవర్ణం కింద గుర్తించి ఇలా రిజర్వేషన్లు ఇస్తున్నట్లు ప్రకటించవచ్చా?అలాంటి అదికారం రాష్ట్ర ప్రబుత్వాలకు ఉంటుందా?బిసిలలో కలుపుతామని ఇచ్చిన హామీని నెరవేర్చాలని కాపు జాతి ఉద్యమించినప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఎంత ఘోరంగా వారిని అవమానించిందో వారు మర్చిపోవాలన్నది చంద్రబాబు లక్ష్యం కావచ్చు.కాని మనసు తగిలిన గాయం అంత తేలికగా మానదు.కాపులు తమ ఆత్మగౌరవాన్ని చంద్రబాబు దెబ్బతీశారని భావిస్తున్నారు.అప్పుడు బిసిలకు, కాపులకు తగాదా పెట్టిన చంద్రబాబు ఇప్పుడు అగ్రవర్ణ పేదల కోటాలో ఐదు శాతం ఇస్తున్నామని చెప్పి కాపులకు ,ఇతర అగ్రవర్ణాల మధ్య తగాదా పెడుతున్నారని కాపు నేతలు వాపోతుంటే, ఒక వేళ నిజంగానే కాపులకు ఈ కోటా వెళుతుందా?అప్పుడు మన పరిస్థితి ఏమిటి?అని ,మిగిలిన కులాల్లో ద్వేష బావన పెంచడానికి టిడిపి ప్రభుత్వ చర్య దోహదపడవచ్చన్న భావన ఉంది.దీనిపై తాము కోర్టుకు వెళతామని, ఈబిసి సంఘాలు చెబుతున్నారు.బ్రాహ్మణ,తదితర కుల సంఘాల నేతలు చెబుతున్నారు.ఇవన్ని ఒక విషయం అయితే అసలు ఈ వివాదాస్పద బిల్లును గవర్నర్ ఆమోదిస్తారా?రాజ్యాంగానికి అనుగుణంగా లేదని బిల్లును వెనక్కి పంపుతారా?అప్పుడు కేంద్రంపై,బిజెపిపై నెపం నెట్టి ఎన్నికలలో ప్రచారం చేసుకుంటారా అన్న చర్చ కూడా ఉంది.ఏది ఏమైనా కాపులను అటు బిసిలలో లేకుండా,ఇటు అగ్రవర్ణాలలో కాకుండా వారిని అవమానాలపాలు చేసి, సమాజంలోని ఇతర వర్గాలకు వారిని దూరం చేసేలా చంద్రబాబు ప్రబుత్వం చేస్తున్న ప్రయత్నాలు దుర్మార్గం గా ఉన్నాయి.చంద్రబాబు ఇలా మోసపూరితంగా వ్యవహరించడం కన్నా, నిజాయితీగా తను ఎన్నికల హామీలో కాపుల రిజర్వేషన్ అమలు హామీ ప్రకటించినా, అది సాధ్యం కాదని తేలిందని,అందువల్ల తనను క్షమించాలని కోరుకుంటే రాజకీయంగా హుందగా ఉంటుంది. అలా కాకుండా ఒక మోసాన్ని కప్పిపుచ్చడానికి మరిన్ని మోసాలు చేసే ప్రక్రియలోకి చంద్రబాబు వెళ్లడం దురదృష్టకరం.

tags : kapu, comment

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info