A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
చంద్రబాబు -గాందీ- టిడిపి మీడియా ఇబ్బంది
Share |
April 25 2019, 1:53 am

ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తాను గాందీనని చెప్పిన డైలాగులకు తెలుగదేశం మీడియా పెద్దగా ప్రాదాన్యం ఇవ్వకపోవడం విశేషం. ఆ పత్రికలలో సంబందిత వార్తలలో ఈ వ్యాఖ్యకు ప్రాదాన్యం ఇవ్వకపోవడం గమనార్హం. గాంధీలా చాలా సాధారణ జీవితం గడుపుతున్న తనపై ప్రధాని నరేంద్ర మోదీ అవినీతి ఆరోపణలు చేస్తారా? అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదివారం నాడు వ్యాఖ్యానించారు. మోదీ రోజూ రూ. కోట్ల విలువైన సూటు బూట్లు వేసుకుంటారని, తాను మాత్రం మహాత్మాగాంధీలా చాలా సాదాసీదాగా ఉంటానని చంద్రబాబు చెప్పారని కదనం. ‘40 ఏళ్లుగా ఒకేరకం బట్టలు వేసుకుంటున్నాను. ఎక్కడకు వెళ్లినా వేషం మార్చడం లేదు. సూట్లు వేసుకోవడం లేదు. ఈ రోజు ప్రజల కోసం నల్ల చొక్కా వేసుకుంటున్నాను’ అని ఆయన అన్నారు. మరి చంద్రబాబు తనను గాందీ అని పోల్చుకుంటే టిడిపి మీడియా ఎందుకు ప్రాముఖ్యత ఇవ్వలేదో!

tags : tdp,media, gandhi,chadnrababu

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info