గతంలో ఉమ్మడి ఎపి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి డిల్లీలో చేసిన ధర్నా మాదిరే ఈసారి ఎన్నికలకు ముందు విభజిత ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిల్లీలో ధర్నా ఆరంబించారు. కాకపోతే కిరణ్ కుమార్ రెడ్డి జంతర్ మంతర్ లో దర్నా చేస్తే చంద్రబాబు ఎపి భవన్ లో నిర్వహిస్తున్నారు.చంద్రబాబు నాయుడు నల్లచొక్కాతో దీక్షకు హాజరయ్యారు.
తొలుత చంద్రబాబు రాజ్‌ఘాట్ వద్ద మహాత్మ గాంధీకి నివాళులర్పించారు. ఏపీ భవన్లో అంబేడ్కర్ విగ్రహానికి నివాళులర్పించారు. దీక్షా వేదికపై గాంధీ, అంబేడ్కర్, ఎన్టీఆర్ చిత్ర పటాలకు చంద్రబాబు నివాళులర్పించారు. రాత్రి 8 గంటల వరకు ఈ దీక్ష జరుగుతుంది. కిరణ్ కుమార్ రెడ్డి సమైక్య రాష్ట్రం కోరుతూ ధర్నా చేస్తే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు నాలుగేళ్లు బిజెపితో కలిసి ఉండి, విడిపోయిన తర్వాత హామీల అమలు కోరుతూ దర్నా చేశారు. tags : chandrababu, kiran, dharna