A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
చంద్రబాబు ఆ చాన్స్ ఎందుకు వదలుకున్నారు!
Share |
February 19 2019, 8:26 am

ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనకు వచ్చిన అవకాశం వదలుకున్నారా? ప్రధాని మోడీకి వ్యతిరేకంగా డిల్లీలో నిరసనలు చేస్తారంటున్న ఈయన ఎపికి వచ్చినప్పుడు స్వయంగా విమానాశ్రయానికి వెళ్లి తన నిరసన పత్రాన్ని ఎందుకు ఇవ్వలేదో తెలియదు.తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు దేశం అంతా తెలిసేలా మోడీకి నిరసనలు తెలపాలని పిలుపు ఇచ్చిన చంద్రబాబు నాయుడు తను మాత్రం ఇంటికే ఎందుకు పరిమితం అయ్యారు? ప్రధానిని ప్రోటోకాల్ ప్రకారం కలుసుకునే అవకశం చంద్రబాబుకు ఉంటుంది. ఆయన మోడీ వెళ్లి పోయిన తర్వాత నల్ల షర్టు వేసుకుని ఉపన్యాసం చెప్పారు. కాని గన్నవరం విమానాశ్రయానికి వెళ్లి అక్కడ కనీసం తన వినతిపత్రాన్ని ఎందుకు ఇవ్వలేదు? మరి డిల్లీ వెళ్లి ఎవరిపై పోరాడతారు?నిజంగానే ఎపికి అన్యాయం జరిగిందని భావిస్తే, నిరసన తెలపాలని అనుకుంటే ఎపికి వచ్చిన మోడీ దగ్గరకు వెళ్లకుండా ,ప్రజల డబ్బు పది కోట్లతో డిల్లీ వెళ్లి ధర్నా చేయడం దేనికి? మోడీకి భయపడ్డారా?లేక ఇంకేమైనా కారణమా?

tags : chandrababu, modi

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info