A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ట్విటర్ లోనా లోకేష్ యుద్దం చేసేది
Share |
February 19 2019, 8:27 am

ప్రధాని నరేంద్ర మోదీతో జతకట్టిన ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. నాడు రాహుల్ గోబ్యాక్ అన్నారని, నేడు చంద్రబాబు, రాహుల్‌తో జతకట్టి మోదీ గోబ్యాక్ అంటున్నారని బాపట్ల నియోజకవర్గం వైఎస్ ఆర్ కాంగ్రెస్ సమన్వయకర్త నందిగం సురేష్ అన్నారు. నరేంద్ర మోదీతో యుద్ధం చేస్తారంటూ లోకేష్ అంటున్నారని, యుద్ధం చేసేది ఎక్కడ.. టీడీపీ నేత ఒక్కరన్నా మోదీని అడ్డుకునే ప్రయత్నం చేశారా అని ప్రశ్నించారు.
మైక్ ముందు మాట్లాడితే దొరికిపోతామనే భయంతో లోకేష్ ట్విటర్ లోనే కామెంట్ చేస్తున్నారని ఆయన ఎద్దేవ చేశారు. హోదా సజీవంగా బతికుందంటే అది వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేసిన పోరాటాల వల్లనేనని స్పష్టం చేశారు. ప్రత్యేక హోదా గురించి మాట్లాడే హక్కు చంద్రబాబుకు లేదన్నారు. చంద్రబాబు, లోకేష్‌లపై సీబీఐ విచారణ జరిపితే సింగపూర్, మలేషియా ఇతర దేశాలకు పారిపోతారని, లేదా జైళ్లకు వెళ్తారన్నారు.

tags : nandigam, lokesh

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info