A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
నన్ను మోడీ తిడితే సహించరు- చంద్రబాబు
Share |
February 19 2019, 8:05 am

రాష్ట్రానికి ఇవ్వాల్సిన నిధులు ఇవ్వకుండా, చేయాల్సిన సాయం చేయకుండా ప్రధాని నరేంద్ర మోడీ ఏ ముఖం పెట్టుకొని వస్తున్నారో అర్థం కావడం లేదని ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు.గతంలో ఎఐసిసి అదినేత రాహుల్ గాందీని కూడా ఇలాగే ఏ ముఖం పెట్టుకుని వస్తున్నారని అన్నారు.ఇప్పుడు మోడీ వంతు వచ్చింది.
విభజన వల్ల కలిగిన గాయం మానకముందే దానిపై కారం చల్లడానికి మోదీ మరోసారి రాష్ట్రానికి వస్తున్నారని మండిపడ్డారు. ‘మనం గృహ ప్రవేశాలకు వెళితే కనీసం పండ్లు చేతపట్టుకొని వెళతాం. కానీ, ప్రధాని హోదాలో అమరావతికి వచ్చిన మోదీ మట్టి-నీళ్లు మన ముఖాన కొట్టి వెళ్లిపోయారు. ఆదివారం మళ్లీ గుంటూరుకు వస్తున్నారు.
నన్ను తిట్టడానికి వస్తున్నారు. నేను ఒక్కటే కోరుతున్నా. మా న్యాయమైన కోర్కెలు తీర్చాకే మా గడ్డకు రండి. కేవలం నన్ను తిట్టడానికే వస్తే రాష్ట్ర ప్రజలు సహించరు’’అని ఆయన అన్నారు.

tags : chadnrababu, modi

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info