A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
చంద్రబాబుకు కులగజ్జి పట్టింది
Share |
August 21 2019, 6:36 am

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కుల గజ్జి పట్టుకుందని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు కోన రఘుపతి, మల్లాది విష్ణు ఆరోపించారు. తన సామాజిక వర్గానికి చెందిన పోలీసు అధికారులను కీలక స్థానాల్లో నియమించడమే ఇందుకు నిదర్శనమని వారు అన్నారు. సర్వేల పేరుతో టీడీపీ బరితెగించి అక్రమాలకు పాల్పడుతోందని విమర్శించారు. ఇప్పటికే తమకు వ్యతిరేకులుగా భావిస్తున్న పలువురి ఓట్లను తొలగించిందని ఆరోపించారు.
గత ఎన్నికల్లో తమ పార్టీ కేవలం 5 లక్షల ఓట్ల తేడాతో అధికారం కోల్పోయిందని.. అందుకే ప్రస్తుతం చంద్రబాబు కుయుక్తులతో గెలవాలని చూస్తున్నారని మండిపడ్డారు. అందుకే దిగజారుడు చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు.

tags : raghupati, babu, caste

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info