A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
చంద్రబాబు జిత్తులమారి నక్క...జాగ్రత్త
Share |
February 19 2019, 8:25 am

ముఖ్యమంత్రి చంద్రబాబు జిత్తులమారి నక్క అని మాజీ ఎంపీ, వైఎస్సార్‌సీపీ అనంతపురం పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి వ్యాఖ్యానించారు.చంద్రబాబు నాయుడు మరోసారి అధికారంలోకి రావాలని కలలు కంటున్నాడని, ఆయన కుట్రలను వైఎస్సార్‌సీపీ శ్రేణులో సమర్థవంతంగా ఎదుర్కోవాలన్నారు. రానున్న ఎన్నికల్లో విజయం సాధించాలంటే బూత్‌ కమిటీలే కీలకమని, అందుకోసమే పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బూత్‌ కమిటీలతో సమావేశం ఏర్పాటు చేశారన్నారు. ఎన్నికల సమయంలో అనేక హామీలు ఇవ్వడం, ఆ తర్వాత వాటిని విస్మరించడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అన్నారు. త్వరలో ఎన్నికలు వస్తున్నాయని, ఇప్పుడు ఓటర్లకు తాయిలాలు ప్రకటిస్తున్నారని ధ్వజమెత్తారు. 1996లో చంద్రబాబు సీఎం అయ్యాక అప్పటి వరకు కిలో బియ్యం రెండు రూపాయలు ఉండగా, చంద్రబాబు ఐదు రూపాయల ఇరవై పైసలు చేశారన్నారు. అనంతపురం జిల్లాలో హంద్రీనీవాకు మూడు సార్లు శంకుస్థాపన చేసి ఆ తర్వాత వదిలేశారన్నారు.

tags : ananta, babu, fox

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info