A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కితకితలు ఆపండి బాబూ
Share |
August 21 2019, 6:47 am

కామెడీ కితకితలు ఆపండి బాబూ అని వైఎస్ ఆర్ కాంగ్రెస్ ఎమ్.పి విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు. ‘కిందటి సారి సీఎంగా ఉన్నపుడు జనాభా తగ్గించాలని చిటికేస్తే జననాల రేటు భారీగా తగ్గిపోయిందట. ఇప్పుడు జనాభా అర్జంటుగా పెంచాలంట. లేకపోతే చైనా, జపాన్లలాగా జనాభా క్షీణించే ప్రమాదముందని చంద్రం సారు భయపెడుతున్నాడు. ఏమిటీ అర్థం లేని పిచ్చి మాటలు?’ అంటూ సెటైరిక్‌గా ట్వీట్‌ చేశారు.

మరో ట్వీట్‌లో చంద్రబాబు నుంచి ఏపీ ప్రజలు కొన్ని ప్రశ్నలకు సమాధానాలు కోరుకుంటున్నారని పేర్కొన్నారు. చంద్రబాబు తన హయాంలో ఎన్ని ప్రాజెక్టులు పూర్తి చేసిండో చెప్పాలని, ఆయన నిర్వహించే సభలకు డబ్బు ఎక్కడిదని, పన్నుకట్టే ప్రజలదా? లేక స్కామ్‌ల్లో సంపాదించిందా? అనే విషయాలకు చంద్రబాబు సమాధానం చెప్పాలని అడుగుతున్నారని ట్వీట్‌ చేశారు. ఇక చంద్రబాబు దుబార ఖర్చులో సగం రాష్ట ప్రజల సంక్షేమానికి ఖర్చు చేసిన బాగుండేదని ఆయన అన్నారు.

tags : vijayasai

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info