A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
రాహుల్ అన్నిటిలో జోక్యం చేసుకునేవారు
Share |
February 19 2019, 7:56 am

కేంద్ర మాజీ మంత్రి ఎస్.ఎమ్.కృష్ణ ఎఐసిసి అద్యక్షుడు రాహుల్ గాందీ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తాను మన్మోమన్ సింగ్ క్యాబినెట్ లో ఉన్నప్పుడు గమనించిన విషయాలను ఆయన వెల్లడించారు. అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్‌ సింగ్‌కు కేబినెట్‌పై ఏమాత్రం అధికారం లేదని, అధికారం మొత్తం రాహుల్ చేతుల్లోనే ఉండేదని ఎస్ఎం కృష్ణ విమర్శించారు.దీంతో గతంలో ఎన్నడూ లేనివిధంగా అవినీతి, కుంభకోణాలు చోటుచేసుకున్నాయన్నారు. పదేళ్ల క్రితం రాహుల్‌ ఎంపీగా మాత్రమే ఉన్నారని, ఆయన ఎలాంటి పార్టీ పదవులు చేపట్టకపోయినా... అన్ని విషయాల్లో తలదూర్చేవారని అన్నారు. మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పటికీ ఆయనకు తెలియకుండానే రాహుల్ పలు నిర్ణయాలు తీసుకునేవారని ఎస్ఎం కృష్ణ పేర్కొన్నారు. రాహుల్ ప్రవర్తనతోనే తాను కాంగ్రెస్ కు, మంత్రి పదవికి రాజీనామా చేశానని ఆయన చెప్పారు.మరోసారి మోడీ గెలవవలసిన అవసరం ఉందని ఆయన అబిప్రాయపడ్డారు.కృష్ణ ప్రస్తుతం బిజెపిలో ఉన్నారు.

tags : bjp, sm krishna

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info