A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
తండ్రి,కొడుకుల తిట్లు గమనిస్తున్నా-మోడీ
Share |
April 25 2019, 1:32 am

ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆంద్రుల సంస్కృతి ని పాడు చేస్తున్నారని ప్రధాని మోడీ అన్నారు. ఆంద్రప్రజల సంస్కృతి ,సంప్రదాయాల గురించి నాకు తెలుసు.కాని కొద్ది రోజులుగా ఇక్కడ జరుగుతున్నది చూడండి..మోడీని ఏమి అంటున్నారో చూడండి.. డిక్షనరీలో ఉన్న పదాలన్నిటిని చంద్రబాబు నన్ను తిట్టడానికే వాడుతున్నారు.ఆంద్ర ప్రజల సంస్కృతిని చెడుగొడుతున్నారు..బాబూ గారు..నెలలుగా నన్ను తిడుతున్నా.. ఒక్క మాట మాట్లాడలేదు..మీ తండ్రి కొడుకుల తిట్లు గమనిస్తున్నా..ఇక్కడకు పెద్ద సంఖ్యలో వచ్చిన ప్రజలు ఎవరూ వీటిని నమ్మడం లేదు. తండ్రి,కొడుకుల అవినీతి రాజ్యం పోతోంది. వీరు ప్రజల అభిమానం కోల్పోయారు అని ఆయన అన్నారు.ఏదైనా పని చేపట్టినప్పుడు దిష్టి తగలకుండా నల్లబొట్టు పెడతారు..అలాగే టిడిపి నల్లబెలూన్ లు బిజెపికి దిష్టి తీసినట్లు అని ఆయన అన్నారు. జై ఆంద్ర,జై ఆంద్ర , భారత మాతకి జై అంటూ మోడీ ప్రసంగం ముగించారు.

tags : modi,

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info