A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ప్రత్యేక హోదా అంశం ప్రస్తావించిన మోడీ
Share |
February 19 2019, 8:49 am

ఎపికి ప్రత్యేక హోదా గురించి ప్రధాని మోడీ ప్రస్తావించారు. ప్రత్యేక హోదా ద్వారా ఎంత డబ్బు వస్తుందో ,అంత మొత్తాన్ని కేంద్రం ప్యాకేజీ ద్వారా ఇవ్వడం జరిగిందని,అందుకు కేంద్ర ఆర్ధిక మంత్రి కి ఎపి అసెంబ్లీలో దన్యవాదాలు కూడా తెలిపారని ఆయన అన్నారు.తాము కమిట్ మెంట్ ప్రకారం ముందుకు వెళ్లామని,కాని ముఖ్యమంత్రే సరిగా శ్రద్ద చూపలేదని ఆయన అన్నారు.ప్రధాని ఆఫీస్ నుంచి పలు కార్యక్రమాలను పర్యవేక్షించామని ఆయన అన్నారు.మూడు లక్షల కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులను ఎపికి ఇచ్చామని,పరిశ్రమలు, లాజిస్టిక్ పార్కు, తదితర ప్రాజెక్టులు ఇచ్చామని ఆయన అన్నారు.విబజన చట్టంలోని హామీలు నెరవేర్చడానికి అన్ని ప్రయత్నాలు చేశామని అన్నారు.ఐఐటి, సెంట్రల్ యూనివర్శిటీ, ఐఐఎమ్. చెన్నై,విశాఖ కారిడార్, తదితర ప్రాజెక్టుల గురించి ఆయన వివరించారు.ఈ ప్రాజెక్టులు, సంస్థలు పదేళ్లలో అమలు చేసే అవకాశం ఉన్నా, తాము ఐదేళ్లలోపే అమలు చేశామని ఆయన అన్నారు.నేను కూడా ముఖ్యమంత్రి గా పనిచేశాను.ఆయా ప్రాంతాల ఆకాంక్షల గురించి తెలుసు. ఎపికి ఎంత చేశామో తెలుసు.మీ అందరికి ఒక విశ్వాసం ఇస్తున్నాను. ఎపి ప్రజలకు పూర్తి న్యాయం చేస్తాను అని ఆయన చెప్పారు.

tags : modi, special status

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info