A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
లోకేష్ తండ్రిగారు..చంద్రబాబు పేరెత్తని మోడీ
Share |
April 25 2019, 1:33 am

ప్రధాని మోడీ తన ప్రసంగంలో ఎక్కడా చంద్రబాబు పేరు ప్రస్తావించకపోవడం విశేషం. అయితే లోకేష్ తండ్రి అని అంటూ వ్యంగ్యంగా ఆయన ప్రసంగా సాగించారు.
లోకేష్ గారి తండ్రి ఈ రకంగా నిజాలను ఎదుకు ఎదుర్కోలేకపోతున్నారో చెప్పాలని వచ్చానని అన్నారు.మొదటిది ఎన్నికలలో ఓడిపోతామన్న భయం..రెండోదీ ఆయన కుమారుడిని రాజకీయాలపై రుద్దాలన్న యత్నం.మూడోది ఆయన ఏ రకంగా సంపన్నుడయ్యారు?నాలుగో సత్యం ఏమిటంటే ఇప్పుడు మాట్లాడుతున్నది కాపలాదారుగా ఉండడం. అందుకే చంద్రబాబుకు నిద్ర పట్టడం లేదు . భయపడుతున్నారని ఆయన అన్నారు. తమ ప్రభుత్వం ఎపిలో జరుగుతున్న నిధుల దుర్వినియోగంపై లెక్కలు అడుగుతున్నామని ఆయన అన్నారు. ప్రతి రూపాయికి లెక్క అడుగుతున్నా..అందుకే భయపడుతున్నారు. బిజెపి సభకు ఎవరు ఖర్చు పెడుతున్నారు..అని లక్ష్మీనారాయణ ను ప్రశ్నించారు. ప్రతిపైసా పార్టీ కార్యకర్తల నిధుల నుంచి అని ఆయన సమాదానం చెప్పారు.కాని చంద్రబాబు ఏమి చేస్తున్నారు?అదే తమకు ,ఆయనకు ఉన్న తేడా అని మోడీ అన్నారు.ఆంద్ర ప్రజలారా మేలుకోండి..డిల్లీకి వెళుతున్నారు...పోటోలు తీయించుకోవడానికి .ఎవరి డబ్బుతో వెళుతున్నారు..జనం డబ్బుతో వెళుతున్నారు..ఎపి ప్రజలకు మీ ఖర్చుల లెక్కలు,ఎక్కడ నుంచో చెప్పండి అని మోడీ ఆవేశంగా అన్నారు.స్కూళ్లలో చదువుతున్నప్పుడు పిల్లలకు వెనక్కి వెళ్లండి అని అంటారు..టిడిపి కార్యకర్తలతో కూడా చెబుతున్నారు..గోబ్యాక్ అని అన్నారు.నేను డిల్లీలో మళ్లీ అదికారం రాబోతోంది. టిడిపి కోరిక తీరబోతోంది..కోట్ల ప్రజల ఆశీర్వాదంతో మళ్లీ డిల్లీలో అదికారంలోకి వస్తానని మోడీ అన్నారు.

tags : modi, lokesh

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info