A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఔను..మీరే సీనియరే..చంద్రబాబుపై మోడీ విసుర్లు
Share |
April 25 2019, 2:15 am

అబద్దాల చెప్పడంలో మహా కూటమి పోటీ పడుతున్నాయని , తనపై ,ప్రభుత్వంపై అసత్యాలు ప్రచారం చేస్తున్నాయని, ఈ పార్టీలు కల్తీ కూటమిగా మారాయని, వాటిలో ఇక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా చేరారని ఆయన అన్నారు.చంద్రబాబు అబివీద్దిని పక్కనబెట్టి తనను తిట్టడమే ద్యేయంగా పెట్టుకున్నారని ఆయన అన్నారు.అమరావతి నిర్మాణం చేస్తానని చెప్పిన చంద్రబాబు తన కూలిపోయిన పార్టీని నిర్మించుకునే పనిలో ఉన్నారని ఆయన అన్నారు. ఎపిని సన్ రైజ్ స్టేట్ అని ప్రచారం చేస్తున్న చంద్రబాబు తన కుమారుడు రైజ్ కోసం ప్రయత్నిస్తున్నారని మోడీ అన్నారు.ఎపి పేదల కోసం హామీ ఇచ్చారు కాని, మోడీ పధకాలకు కేవలం స్టికర్ లు అతికించే కార్యక్రమం చేపడుతున్నారని అన్నారు.ఆయన తన కన్నా సీనియర్ ..అందులో వివాదం ఏముంది..మీరు సీనియర్ అయితే మీకు గౌరవం ఇచ్చాను. పార్టీలు మారడంలో , కూటమిలు మార్చడంలో సీనియర్ అని ఆయన ఎద్దేవ చేశారు. మీరే సీనియర్ ..మామగారికి వెన్నుపోటు పొడిచి అదికారం సాదించడంలో సీనియర్ ..అన్నప్పుడు సభికులు హర్షద్వానాలు చేశారు.ఎన్నికల తర్వాత ఓడిపోవడం మీరు సీనియర్..నేను ఆ విషయంలో పోటీలోకి రాలేను..మీరు సీనియర్ ..ఎవరిని తిడతారో,ఆ తర్వాత వారి ఒడిలో కూర్చోవడంలో సీనియర్..ఆంద్రప్రజల కలలను నిర్వీర్యం చేయడంలో సీనియర్ అని మోడీ వ్యాఖ్యానించారు.

tags : chadnrababum senior

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info