A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
జాషువా, వావిలాల లను ప్రస్తావించిన మోడీ
Share |
April 25 2019, 1:32 am

భారతమాతాకి జై అంటూ ప్రధాని నరేంద్ర మోడీ గుంటూరులో తన ప్రసంగం ఆరంభించారు.అక్షర క్రమం తో పాటు అన్ని రంగాలలో కూడా ముందుండే ఆంద్ర ప్రజలకు శుభాకాంక్షలు అన్నారు. దళిత కవి గుర్రం జాషువా, మహాభారత కవి తిక్కన పుట్టిన స్థలం గుంటూరు జిల్లాకు వచ్చినందుకు సంతోషం ఉందని ఆయన అన్నారు. ఇక్కడకు ఇంత మంది వచ్చినందుకు సంతోషంగా ఉందని,తనకు మరింత స్పూర్తి ఇచ్చిందని ఆయన అన్నారు. ప్రఖ్యాత స్వాతంత్రయోదుడు వావిలాల గోపాలకృస్ణయ్య, శాస్త్రవేత్త నాయుడమ్మలను ఆయన గుర్తు చేసుకున్నారు.ఎపి రాజధాని అమరావతికి పలు రకాలుగా కేంద్రం సహాయం చేస్తోందని ఆయన అన్నారు.దీనిని హెరిటేజ్ ప్రాంతంగా కూడా గుర్తించామని ఆయన అన్నారు.గుంటూరును ఆక్ఫఫర్డ్ నగరంగా చెబుతారని ఆయన అన్నారు.

tags : modi, jashuva

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info