A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఎపికి మోడీ చేసిన సేవ ప్రజలు మర్చిపోరు
Share |
February 19 2019, 8:51 am

ఆంద్రప్రదేశ్ కు ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన ప్రాజెక్టులు, నిధులను ప్రజలు మర్చిపోలేరని ఎపి బిజెపి అద్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ చెప్పారు. ప్రదాని మోడీ పాల్గొన్న చైతన్య సభ లో ఆయన మాట్లాడారు.కేవలం గుంటూరు,కృష్ణా జిల్లాలలోనే వేల కోట్ల రూపాయల ప్రాజెక్టులను ఇచ్చారని ఆయన అన్నారు. గన్నవరం విమానాశ్రయం నుంచి గుంటూరులోని రహదారుల వరకు ,వంతెన మొదలు పలు స్కీములకు కేంద్రం నిదులు ఇచ్చిందని ఆయన అన్నారు. చంద్రబాబు ఈ జిల్లాలకు ఇవి కాకుండా చేసిన ఒక స్కీమ్ చెప్పగలవా అని చంద్రబాబును సవాల్ చేస్తున్నానని ఆయన అన్నారు. ఎపిలో ఇసుక దోపిడీ నుంచి అనేక అవినీతి కార్యకలాపాలతో చంద్రబాబు ప్రభుత్వం దోపిడీ చేసిందని ఆయన ఆరోపించారు.గ్రామాలలో నిర్మిస్తున్న రోడ్లు కాని, ఇన్ పుట్ సపోర్టు పేరుతో రైతులకు ఆరువేల రూపాయల చొప్పున ఇవ్వడం కాని ఇవన్ని మోడీ చేస్తున్న అబివృద్ది అని ఆయన అన్నారు.
ఎపికి కియో పరిశ్రమ రావడానికి మోడీ ఎంతగానో సహకరించారని ఆయన అన్నారు.విభజన చట్టంలోని కేంద్ర సంస్థలను ఐదు సంవత్సరాలలోనే ఇచ్చారని ఆయన అన్నారు.మొత్తం 39 కేంద్ర సంస్థలను ఎపికి ఇచ్చారని ఆయన అన్నారుకాని ముఖ్యమంత్రి చంద్రబాబు అబద్దాలు చెబుతున్నారని ఆయన అన్నారు.

tags : kanna, ap, modi

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info