ఎపిలో పోలీసులు కూడా తమాషాగానే పనిచేస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎపిలో ఏ జిల్లాకు వెళ్లినా అక్కడ ఎవరైనా నిరసన చెబుతారనుకుంటే ముందుగానే గృహ నిర్భంధాలు వంటివి చేస్తారు.ఎక్కడా నిరసనకారులు లేకుండా జాగ్రత్తపడుతుంటారు. కాని ప్రధాని మోడీ రాక సందర్భంగా మాత్రం నిరసనకారులు స్వేచ్చ ఇచ్చినట్లుగా ఉంది.గుంటూరులో శంకర్ విలాస్ సెంటర్ లో కమ్యూనిస్టులు నిరసన చేపట్టారు.అటుగా వచ్చిన బిజెపి నేత దారా సాంబయ్య కారును వారు అడ్డుకున్నారట. ఇక ప్రధాని మోడీ గన్నవరం విమానాశ్రంయ చేరుకున్నప్పుడు గవర్నర్ నరసింహన్ ,ఛీప్ సెక్రటరీ, డిజిపి తదితరులు స్వాగతం పలికారు. బిజెపి ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ కూడా ఉన్నారు.అయితే రాష్ట్ర బిజెపి అద్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ను విమానాశ్రయం వద్ద అనుమతించలేదట.దీనిని బట్టి బిజెపి నాయకత్వం కాని, ప్రదాని ఆఫీస్ కాని ఎంత తెలివిగా పనిచేస్తున్నాయన్న ప్రశ్న వస్తుంది. tags : modi, guntur tour