A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
లక్ష్మీస్ ఎన్.టి.ఆర్.ట్రైలర్ 14 న విడుదల
Share |
April 25 2019, 2:16 am

లక్ష్మీస్ ఎన్.టి.ఆర్.సినిమా ఎలా తీస్తున్నారో తెలియదు కాని, ప్రముఖ దర్శకుడు నిర్మాత నిత్యం ట్విటర్ లో మోత మోగిస్తున్నారు. పిభ్రవరి పద్నాలుగున వాలంటైన్స్ డే నాడు ఈ సినిమా ట్రైలర్ విడుదల చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఎన్.టి.ఆర్. తన జీవితంలో లక్ష్మీపార్వతిని రెండో వివాహం చేసుకున్నప్పటి నుంచి జరిగిన పలు పరిణామాలను ఆయన తెరకు ఎక్కిస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్‌ను ప్రేమికుల రోజు సందర్భంగా ఫిబ్రవరి 14న ఉదయం 9 గంటల 27 నిమిషాలకు రిలీజ్‌ చేయనున్నట్టు ప్రకటించారు.
ఈ సందర్భంగా పోస్టర్స్‌ రిలీజ్‌ చేసిన వర్మ ఎన్టీఆర్‌ కథానాయకుడు కాదు.. మహానాయకుడు కాదు. ఆయన అసలు నాయకుడు అయితే ఆయనకు వెన్నుపోటు పొడిచిన వ్యక్తి అసలు సిసలు నాయకుడు అని వర్మ ఎద్దేవ చేశారు.

tags : varma, lakshmis ntr

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info