A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
మోడీకి చంద్రబాబు లేఖ
Share |
April 25 2019, 1:37 am

ప్రధాని నరేంద్ర మోడీకి ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరోసారి లేఖ రాశారు. మోడీ గుంటూరు పర్యటన నేపధ్యంలో ఆయన ఈ లేఖ రాశారు.ప్రత్యేక హోదా, విభజన హామీలు మొదలైన అంశాలను ఆయన అందులో ప్రస్తావించారు. ‘‘2014 ఎన్నికల్లో ఇచ్చిన హామీలు, వాటి అమలు తీరును మీకు గుర్తు చేస్తున్నా. ఐదు కోట్ల మంది ఏపీ ప్రజల తరఫున మరోసారి గుర్తు చేస్తున్నా. ఐదేళ్లుగా కేంద్ర ప్రభుత్వం చేసిన అన్యాయాన్ని ప్రజలు నిరసిస్తున్నారు. తల్లిని చంపి బిడ్డను తీశారని ఎన్నికల ప్రచార సభలో కాంగ్రెస్‌ను మీరే విమర్శించారు. తల్లి, బిడ్డను కాపాడుతానని మీరు చెప్పిన మాటలను మరోసారి మీకు గుర్తు చేస్తున్నా. అన్ని రంగాల్లో ఏపీని అభివృద్ధి చేస్తానన్న మీ మాటలను గుర్తు చేస్తున్నా. అమరావతి రాజధాని శంకుస్థాపన సభలో ఇచ్చిన మాట మీకు గుర్తుందా? దిల్లీ కూడా చిన్నబోయే రాజధానిని నిర్మించేందుకు సహకరిస్తానన్న మాట గుర్తుందా? విభజన చట్టంలోని అంశాలను తూ.చ. తప్పకుండా చేస్తానని చెప్పారు. ఏపీని అభివృద్ధి చేస్తానని చెప్పి.. ‘నీరు, మట్టి’ ఇచ్చి వెళ్లారు. విభజన చట్టంలోని పలు అంశాల అమలు పట్ల నిర్లక్ష్యం ప్రదర్శించారు. విభజన చట్టంలో అంశాల అమలు కోసం కేంద్ర ప్రభుత్వం వద్దకు నేనే 29సార్లు వచ్చి విజ్ఞప్తి చేశాను. చట్టపరంగా, హక్కుగా మాకు రావాల్సిన ప్రయోజనాలను అడ్డుకోవడం బాధాకరం. ప్రత్యేక హోదా ప్రకటించాలని అనేకసార్లు కోరినా తీరని అన్యాయం చేశారు. ప్రత్యేక హోదా ఆకాంక్ష అమలుకు ఏడాదిగా ధర్మపోరాటాలు చేస్తున్నాం. ధర్మ పోరాటాలు చేస్తున్నప్పటికీ ఏ మాత్రం స్పందించడంలేదు.
పోలవరం ప్రాజెక్టుల పనులు 64శాతం మేర పూర్తి చేయగలిగాం. నిధులను నిలిపివేసి.. పోలవరం రివైజ్డ్‌ డీపీఆర్‌కు ఆమోదం తెలపడంలేదు.అని ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు.

tags : modi, babu,letter

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info