A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఎపిలో టిడిపి హోర్డింగ్ ల డ్రామా
Share |
April 25 2019, 2:19 am

ప్రధాని మోడీ కి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ పలు హోర్డింగ్ లు ఏర్పాటు చేసి కొత్త అంకానికి తెరదీసింది. గన్నవరం విమానాశ్రయం నుంచి విజయవాడ మీదుగా గుంటూరు వరకు పలుచోట్ల హోర్డింగులు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేయించింది. ‘మోదీ గో బ్యాక్‌’ అంటూ ఉన్న పెద్దపెద్ద హోర్డింగులను శుక్రవారం అర్ధరాత్రి తరువాత ఏర్పాటు చేశారు.
నిబంధనల ప్రకారం హోర్డింగులు, కరపత్రాల కింద వాటిని ముద్రించినవారి పేర్లు, ముద్రణ సంస్థల పేర్లు ఉండాలి. అయితే ఆ హోర్డింగులు ఎవరు ఏర్పాటు చేశారో వారి పేర్లుగానీ, వాటిని రూపొందించిన ప్రచురణ సంస్థల పేర్లుగానీ లేవు. కొన్నాళ్లుగా రాష్ట్ర ప్రభుత్వ పథకాలు, టీడీపీ కార్యక్రమాల ప్రచారం కోసం ఏర్పాటు చేసిన హోర్డింగుల స్థానంలోనే ‘మోదీ గో బ్యాక్‌’ హోర్డింగులు పెట్టారు. రాష్ట్ర ప్రభుత్వ పథకాల ప్రచార కాంట్రాక్టు పొందిన సంస్థతోనే ఈ హోర్డింగులు ఏర్పాటు చేయించారని సమాచారం అని మీడియాలో కధనాలు వచ్చాయి.ప్రభుత్వమే వెనుక ఉండి వీటిని ఏర్పాటు చేయడంతో అదికారులు స్పందించలేదట. అయితే ప్రధాని పర్యటన ఏర్పాట్ల పరిశీలనకు వచ్చిన కేంద్ర ప్రభుత్వ, ఎస్‌పీజీ ఉన్నతాధికారులు ఈ హోర్డింగులపై తీవ్రంగా స్పందించినట్లు సమాచారం.
వాటిని ఎవరు ఏర్పాటు చేశారో తెలపాలని కృష్ణా, గుంటూరు జిల్లాల రెవెన్యూ, పోలీసు ఉన్నతాధికారులను సూటిగా ప్రశ్నించినట్లు తెలుస్తోంది. దీనిపై ఏం చెప్పాలో తెలియక రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఇబ్బందిపడ్డారు. దీనిపై తీవ్రంగా స్పందించిన కేంద్రప్రభుత్వ ఉన్నతాధికారులు వెంటనే ఆ హోర్డింగులను తొలగించాలని ఆదేశించారు. దాంతో తర్జనభర్జనల అనంతరం రాష్ట్ర పోలీసు, రెవెన్యూ అధికారులు శనివారం సాయంత్రం తరువాత ఆ హోర్డింగులలో కొన్నింటిని తొలగించారు.

tags : ap, hoarding

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info