A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
బిజెపి అన్యాయం వాస్తవం.చంద్రబాబే కారణం
Share |
February 19 2019, 8:39 am

ఎపికి బిజెపి అన్యాయం చేసిందన్న మాట వాస్తవమేనని, అయితే అందుకు కారణం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడేనని వైఎస్ ఆర్ కాంగ్రెస్ అదికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. అందువల్ల ప్రదాని మోడీ పర్యటనను అడ్డుకునే నైతిక హక్కు టిడిపికి లేదని ఆయన అన్నారు.నాలుగేళ్లు బీజేపీతో అంటకాగిన చంద్రబాబు నాయుడుకు ,ఇప్పుడు డ్రామాలు అడుతున్నారని ఆయన అన్నారు. గతంలో రాహుల్‌ గాంధీ ఏపీ పర్యటనకు వస్తే చంద్రబాబు నల్లజెండాలతో నిరసన తెలిపారని, ఇప్పుడు రాహుల్‌ కాళ్లు పట్టుకునే స్థితికి చంద్రబాబు దిగజారిపోయారని పేర్కొన్నారు. ఏపీ ప్రత్యేక హోదా కోసం గతంలో తాము పోరాటం చేస్తే అరెస్టులు చేసి అణచివేశారని ఇప్పుడు చంద్రబాబు చేస్తున్నదేమిటని ఆయన ప్రశ్నించారు. ‘‘గతంలో రాహుల్‌ను విమర్శించిన చంద్రబాబే నేడు ఆయన ప్రధాని కావాలని అంటున్నారు. నాలుగు రోజులు అయ్యాక మోదీ మరోసారి ప్రధాని కావాలని చంద్రబాబు అన్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ధర్మపోరాట దీక్ష పేరుతో చంద్రబాబు ప్రజల సొమ్మును దుర్వినియోగం చేస్తున్నారని ఆయన ద్వజమెత్తారు.

tags : ambati, bjp,

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info