A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
25 కోట్లు ఎన్నికలలో ఖర్చు చేస్తామని ...
Share |
August 21 2019, 7:18 am

ఒక్కో నియోజకవర్గంలో ఎన్నికలలో పాతిక కోట్ల వరకు ఖర్చు పెట్టగలమని ఎపిలో అదికార పార్టీవారు చెబుతున్నారంటే ఎంత అవినీతి జరిగిందో అర్దం చేసుకోవచ్చని మాజీ సి.ఎస్.అజయ్ కల్లం వ్యాఖ్యానించారు.ఎపిలో అవినీతి తారా స్థాయికి చేరడంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.సేవ్ ఆంద్రప్రదేశ్, సేవ్ డెమొక్రసీ సదస్సులో ఆయన మాట్లాడారు.
జన్మభూమి కమిటీలు డబ్బు సంపాదన కోసమే ఏర్పాటయ్యాయని అజయ్‌ కల్లం ఆరోపించారు. డబ్బు కోసం టీడీపీ ప్రభుత్వం అవినీతిని ప్రోత్సహిస్తోందని ఆయన అన్నారు. శుక్రవారం విశాఖలో సేవ్‌ ఆంధ్రప్రదేశ్‌- సేవ్‌ డెమోక్రసీ పేరిట సదస్సు నిర్వహించారు.అవినీతి సంస్థాగతంగా వ్యవస్థీకృతమైందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధానంగా అవినీతికి ఎమ్మెల్యేలే మూలకారణమని అభిప్రాయపడ్డారు. పేదల ఇళ్ల నిర్మాణంలో వందల కోట్ల అవినీతి జరుగుతోందని ఆయన విమర్శించారు. ఏపీలో ఇసుక దోపిడి కోట్లల్లో సాగుతోందని ధ్వజమెత్తారు. టీడీపీ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్ట్‌ అంచనా వ్యయాన్ని మూడు రెట్లు పెంచిందన్నారు. సీఎంతో సహా పదవుల్లో ఉన్న వారికి ప్రాజెక్టుల్లో ఆరు శాతం వాటాను కాంట్రాక్టర్లు ఇస్తున్నారని తెలిపారు. అలా సంపాదించిన డబ్బును ఎన్నికల్లో ఖర్చు చేయాలని ప్రభుత్వం చూస్తోందని అజయకల్లం అన్నారు.

tags : ajaykallam, electons

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info