A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఎపిలో బోగస్ ఓట్లపై విచారణ
Share |
August 21 2019, 7:24 am

ఎపిలో బోగస్ ఓట్లపై విచారణ చేస్తున్నట్లు సిఇఓ ద్వివేది తెలిరారని వైఎస్ ఆర్ కాంగ్రెస్ అదికార ప్రతినిది అంబటి రాంబాబు చెప్పారు. విచారణ 15 రోజుల్లో పూర్తవుతుందన్నారు. రాజకీయ పార్టీల నేతలతో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాల్‌కృష్ణ ద్వివేది శుక్రవారం భేటీ అయ్యారు. సీపీఎం, సీపీఐ, బీజేపీ నాయకులతో పాటు వైఎస్సార్‌ సీపీ తరపున అంబటి రాంబాబు హాజరయ్యారు. ఓటర్ల నమోదు ప్రక్రియ సమర్థవంతంగా జరగాలని సూచించినట్టు చెప్పారు. ఓటు హక్కుపై అవగాహన కల్పించేందుకు రాజకీయ పార్టీలు ముందుకు రావాలని ద్వివేది కోరినట్టు తెలిపారు. భారీగా క్యూలైన్‌ కాకుండా టోకెన్‌ పద్ధతిని ప్రవేశపెట్టే విషయంపై సమావేశంలో చర్చ జరిగిందన్నారు. రాష్ట్రంలో 1.15 లక్షల ఈవీఎంలు ఉన్నాయన్నాయని, ఈవీఎంల మొదటి దశ తనిఖీలు జరుగుతున్నట్టు ద్వివేది తెలిపారు. ఈవీఎంల తనిఖీల్లో రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొనాలని కోరారు.

tags : ambati, bogus votes

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info