A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఇంతకీ కాపులు బిసిలా..అగ్రవర్ణాలా
Share |
August 21 2019, 5:49 am

ఇంతకీ ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాపులను బిసిలుగా చూస్తారా?అగ్రవర్ణాలుగా చూస్తారా అని శాసనమండలిలో విపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ప్రశ్నించారు.దీనికి చంద్రబాబు సమాదానం చెప్పాలని ఆయన అన్నారు.
రిజర్వేషన్‌ పేరుతో చంద్రబాబు కాపులను దగా చేస్తున్నారని దుయ్యబట్టారు. కాపులకు ఎన్నిసార్లు రిజర్వేషన్లు ఇస్తారు చంద్రబాబూ.. అని ప్రశ్నిం చారు. అసెంబ్లీలో కాపులకు ఈబీసీ రిజర్వేషన్లలో 5 శాతం కేటాయిస్తున్నట్లుగా బిల్లు పెట్టారన్నారు.కాపులకు రిజర్వేషన్ల అంటూ తప్పుదోవ పట్టిస్తున్నారా..? లేక వారు అమాయకులని అనుకుం టున్నారా? అని ఆయన ప్రశ్నించారు. 2014 ఎన్నికల ప్రచారంలో కాపులను బీసీల్లో చేర్చుతామంటే నమ్మి ఓట్లేశారని, మళ్లీ ఇప్పుడు ఐదు శాతం అంటే ఓట్లు వేస్తారని చంద్రబాబు మరో కొత్త నాటకం ఆడుతున్నారని ఆయన అన్నారు.

tags : ummareddy, kapu

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info