A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
డిల్లీ దీక్షకు ప్రజల డబ్బు 10 కోట్లు-జిఓ
Share |
April 25 2019, 1:16 am

ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజల డబ్బును పది కోట్లు ఖర్చు చేసి డిల్లీలో ధర్నా డ్రామా నిర్వహించబోతున్నారని ఒంగోలు మాజీ ఎమ్.పి వైవిసుబ్బారెడ్డి విమర్శించారు.ప్రత్యేక హోదాకోసం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ చందాలు వేసుకుని పోరాటాలు చేస్తే సీఎం చంద్రబాబు ప్రజల డబ్బుతో దొంగ దీక్షలు చేస్తున్నారని ఆయన అన్నారు. ఎవరిని మభ్యపెట్టేందుకు ఈ ధర్మపోరాటమన్నారు. ఈ నెల 11న ఢిల్లీలో ధర్మ పోరాట దీక్ష పేరిట జిల్లాలనుంచి టీడీపీ కార్యకర్తలు, మద్దతుదారులు, ఉద్యోగులను ఢిల్లీకి తరలిస్తుండడాన్ని ఆయన తప్పుపట్టారు. ప్రభుత్వ ఖర్చుతో రెండు రైళ్లను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారన్నారు. మొత్తంగా ఢిల్లీ దీక్ష కోసం రూ.10 కోట్లు విడుదల చేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసిందన్నారు. గతంలో హోదాపై చంద్రబాబు ఏమి మాట్లాడింది గుర్తు చేసుకోవాలని ఆయన అన్నారు.

tags : subbareddy, chandrababu

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info