A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
జగన్ ను అభినందించిన ఆర్.కృష్ణయ్య
Share |
February 19 2019, 8:00 am

వైఎస్ఆర్ కాంగ్రెస్ ను, ఆ పార్టీ అదినేత జగన్ ను బిసి సంఘం అద్యక్షుడు,మాజీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య అబినందించారు. ఆయా పార్టీలు బిసిలకు సంబందించి చట్టసభలలో రిజర్వేషన్ లపై హామీ ఇవ్వడమే తప్ప,ఆచరణలో ప్రయత్నించడం లేదని, అలాంటి సమయంలో వైఎస్ ఆర్ కాంగ్రెస్ బిసిలకు ఏభై శాతం రిజర్వేషన్ లు కోరుతూ రాజ్యసభలో ప్రైవేటు బిల్లు పెట్టిందని కృష్ణయ్య చెప్పారు.ఇందుకు గాను తాము ఆ పార్టీని, జగన్ ను అభినందిస్తున్నామని ఆయన అన్నారు. బిసిల డిమాండ్ లపై జగన్ ను కృష్ణయ్య కలిశారు. బీసీ రిజర్వేషన్ అంశాన్ని రాజ్యసభలో తమ పార్టీ తరపున లేవనెత్తుతామని వైఎస్‌ జగన్ హామీ ఇచ్చారన్నారు. బీసీల కోసం దివంగత మహానేత వైఎస్‌ రాజశేఖరెడ్డి ఎంతో కృషి చేశారనే విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లానని అన్నారు. ఈ నెల 17న ఏలూరులో నిర్వహించనున్న బీసీ గర్జన సభకు రమ్మని తనను వైఎస్‌ జగన్‌ ఆహ్వానించారని చెప్పారు. బీసీల కోసం ఎక్కడ సభ పెట్టినా, ఏ పార్టీ సభ నిర్వహించినా వెళ్తానని ఆర్‌.కృష్ణయ్య తెలిపారు.కృస్ణయ్య ప్రస్తుతం కాంగ్రెస్ లో ఉన్నారు.

tags : krishnayya, jagan,

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info