A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కల్తీ మద్యం మృతుల సంఖ్య 92 కి చేరింది
Share |
February 19 2019, 8:51 am

ఉత్తరప్రదేశ్ , ఉత్తరాఖండ్ లలో కల్తీ మద్యం తాగిన మరణించినవారి సంఖ్య బాగా పెరిగింది.తాజాగా అందిన సమచారం ప్రకారం 92 మంది మరణించారు.
మీరట్‌లో 18 మంది, సహరాన్‌‌పూర్‌లో 46, రూర్కీలో 20, కుశీనగర్‌లో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు చెప్పారు. సహరాన్ పూర్ లో మరణించినవారికి పరీక్ష లు చేయగా, 34 మంది నాటు సారా వల్ల చనిపోయారని వెల్లడైంది.ఈ మరణాలపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం పలువురు అదికారులను సస్పెండ్ చేసింది. మరణించినవారి కుటుంబాలకు రెండు లక్షల రూపాయల చొప్పున పరిహారం ప్రకటించింది. కాగా ఉత్తరాఖండ్ లో రూర్కీకి సమీపాన బలపూర్‌ గ్రామంలో ఓ వ్యక్తి సంస్మరణ కార్యక్రమం నేపథ్యంలో అక్కడి సంప్రదాయం ప్రకారం అందరికీ మద్యం పంపిణీ చేశారు. దానిని తీసుకున్నవారిలో పలువురు మరణించారు.

tags : up, liquor

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info