A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
మోడీ చిరస్మరణీయ ప్రసంగం చేస్తారు
Share |
February 19 2019, 8:52 am

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గుంటూరులో చేయబోయే ప్రసంగం చిరస్మరణీయంగా ఉంటుందని బిజెపి ఎమ్.పి జివిఎల్ నరసింహారావు అన్నారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కొందరు నేతలు వయసు పెరిగే కొద్ది చిన్నతనంగా వ్యవహరిస్తారని, మరికొందరు నేతలు అంచెలంచెలుగా ఎదిగి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుని సేవలందిస్తారని ఆయన అన్నారు. మోడీ అలా అంచెలంచెలుగా ఎదిగి దేశానికే ప్రతిష్ట తెచ్చిన నేత అని ఆయన అన్నారు.మూడు జాతీయ ప్రాజెక్టులను ప్రధాని జాతికి అంకితం చేస్తారని ఆయన అన్నారు. ఓఎన్ జిసి వశిష్ట ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తారని ఆయన అన్నారు.5700 కోట్ల వ్యయంతో దీనిని ఓఎన్జిసి చేపట్టిందని ఆయన అన్నారు.ఈ విషయం తెలిస్తే చంద్రన్న గ్యాస్ పీల్డ్ అని పేరు పెట్టుకుని ఉండేవారని జివిఎల్ ఎద్దేవ చేశారు. చంద్రబాబుకు దీని గురించి తెలిసి ఉండదని ఆయన అన్నారు. ఐఎస్ పిఆర్ఎల్ సంస్థను విశాఖలో స్టోరేజీ కెపాసిటీని అబివృద్ది చేయడానికి రెండువేల కోట్ల రూపాయలతో నిర్మించారని అన్నారు.కృష్ణపట్పంలో నిర్మించడానికి బిపిసిఎల్ నిర్మించే మరో ప్రాజెక్టుకు ప్రధాని ప్రారంబోత్సవం చేస్తారని ఆయన అన్నారు.తదుపరి బిజెపి ఆద్వర్యంలో జరిగే సభలో ప్రసంగిస్తారని ఆయన వివరించారు.ఈ సభ ఖర్చుఅంతా తమ పార్టీనే భరిస్తుందని ఆయన చెప్పారు. చంద్రబాబు నాయుడు పార్టీ పనులకు కూడా ప్రభుత్వ ధనాన్ని వెచ్చిస్తున్నారని ఆయన విమర్శించారు.

tags : gvl, modi, speech

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info