A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఓటుకు కేసు మత్తయ్య ఆసక్తికర వ్యాఖ్యలు
Share |
August 21 2019, 6:16 am

ఓటుకు కేసులో నిందితులలో ఒకరైన జెరుసలెం మత్తయ్య ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.మీడియాలో వచ్చిన కధనం ప్రకారం ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వచ్చే ఎన్నికలలో పోటీచేయరాదని అంటున్నారట. ఓటుకు కేసులో చంద్రబాబు రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడ్డారని ఆయన వ్యాఖ్యానించారు.అందువల్ల చంద్రబాబును వచ్చే ఎన్నికల్లో పోటీ చేయకుండా చూడాలని అన్నారు. మత్తయ్య శనివారం విజయవాడలో మాట్లాడుతూ..ఈ కేసుపై ఎన్నికలకు ముందే దర్యాప్తు చేసి దోషులను కఠినంగా శిక్షించాలని కోరారు.
ఈ కేసులో తనను బలవంతంగా ఇరికించారని ఆయన చెప్పారు. హైకోర్టు తనను నిర్దోషి అని పేర్కొందని ఆయన అన్నారు. సుప్రీంకోర్టులో తాను వేసిన కేసులో ఉదయసింహ ఎలా ఇంప్లీడ్‌ అవుతారని ప్రశ్నించారు. అయితే ఉదయసింహాతో పాటు, చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి కూడా ఇంప్లీడ్ అవ్వాలన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తనను ప్రలోభాలకు గురి చేశారని మత్తయ్య ఆరోపించారు.ఈ కేసును సిబిఐ దర్యాప్తు చేయాలని ఆయన కోరారు.

tags : mattayya, comments

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info