A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
విగ్రహాల వల్ల ఆదాయం -మాయావతి రిప్లై
Share |
February 19 2019, 8:53 am

లక్నో లో పార్కులో తమ ఎన్నికల గుర్తు అయిన ఏనుగు విగ్రహాలను ,తన విగ్రహాన్ని ఏర్పాటు చేసినందుకు గాను అయిన ఖర్చును బిఎస్పి అదినేత్రి మాయావతినే భరించలని సుప్రింకోర్టు ఇచ్చిన ఆదేశంపై ఆమె స్పందించారు.యుపిలో ఏర్పాటు చేసిన ఈ విగ్రహాల వల్ల ప్రభుత్వానికి ఆదాయం వస్తోందని ఆమె వ్యాఖ్యానించారు.‘ప్రముఖ గురువులు, సాధువులు, ఓబీసీ, దళితుల్లో జన్మించిన గొప్ప వ్యక్తులను ప్రజలకు గుర్తుచేసేందుకు, వారిని స్మరించుకునేందుకు గౌరవార్థంగా విగ్రహాలను ఏర్పాటు చేశాం అని ఆమె చె్ప్పారు. యూపీలో ఏర్పాటు చేసిన ఈ విగ్రహాలు పర్యాటకులను ఆకర్షిస్తున్నాయని, తద్వారా ఆదాయాన్ని సమకూరుస్తున్నాయని ఆమె చెప్పారు. భాజపా, మీడియా దీనిపై అనవసర రాద్ధాంతం చేయడం ఆపండని మాయావతి ట్వీట్‌ చేశారు.

tags : mayawati, statues, comments

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info