A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
చంద్రబాబు దీక్ష పై జగన్ రియాక్షన్
Share |
April 25 2019, 2:17 am

ప్రజాధికార సర్వే పేరుతో తెలుగుదేశం ప్రబుథ్వం తమకు అనుకూలంగా లేని వారి ఓట్లను ఎలా తొలగిస్తున్నది గవర్నర్ నరసింహన్ కు వివరించామని విపక్ష నేత జగన్ చెప్పారు.గవర్నర్ తో భేటీ అయిన తర్వాత ఆయన మాట్లాడారు. ఎన్నికల సంఘం వారికి ఏమైతే చెప్పామో, వాటిని గవర్నర్ కు తెలిపామని ఆయన చెపపారు.ప్రభుత్వం పోలీసులను ఎలా దుర్వినియోగం చేస్తున్నదో కూడా తెలియచేశామని అన్నారు.చంద్రబాబు డిల్లీ దీక్షపై అడిగిన ప్రశ్నకు సమాదానం ఇస్తూ ఒక వ్యక్తి తానే హత్య చేసి,దానిపై దీక్ష చేస్తే ఎలా ఉంటుందో అలాగే ఈ దీక్ష ఉందని ఆయన అన్నారు.ప్రత్యేక హోదా రాకుండా పోవడానికి చంద్రబాబే కారణమని అన్నారు.అసెంబ్లీలో ఏ రకంగా హోదాను వ్యతిరేకించింది అందరికి తెలుసనని ఆయనఅ న్నారు.ప్రత్యేక హోదా సంజీవనా అని ప్రశ్నించింది చంద్రబాబే కదా అని అన్నాఉ.ప్యాకేజీ కావాలని లాబీయింగ్ చేశానని కూడా చంద్రబాబు చెప్పారని అన్నారు.ఆ తర్వాత అరుణ్ జైట్లిని, కేంద్రాన్ని పొగుడుతూ తీర్మానం చేసింది ఈయనే కదా.బిజెపి ప్రభుత్వం చేసినంత మేలు ఎప్పుడైనా జరిగిందా అని చంద్రబాబే అన్నారని ఆయన అన్నారు.ఇద్దరు టిడిపి ఎమ్.పిలో కేంద్రంలో మత్రులుగా పని చేశారని ఆయన అన్నారు.ఈ రోజు చంద్రబాబు నల్లషర్టులతో దీక్ష అంటే దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్లుగా ఉందని ఆయన ఎద్దేవ చేశారు.నాలుగేళ్లు చంద్రబాబు ప్రజలను మోసం చేశారని ఆయన అన్నారు.

tags : jagan, chadnrababu,fast

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info