తన రాస్ట్రంలోని పోలీసు అదికారులపై దాడులు చేయడానికి వీలులేదని,వారిని విచారించడానికి ఒప్పుకోబోమని చెప్పిన పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ ,సిబిఐ అదికారుల ఆస్తుల మీద రాష్ట్ర పోలీసులతో దాడులు చేయిస్తున్నారు.నాగేశ్వరరావు భార్య,కూతురు లకు చెందిన సంస్థలపై ఈ దాడులు చేశారు. ప్రతీకార దాడులుగానే వీటిని భావిస్తున్నారని కధనం.కేవలం పరిశీలన నిమిత్తం వచ్చామని కోల్కతా పోలీసులు చెబుతున్నా అసలు విషయం మాత్రం వేరుగా ఉందని అంటున్నారు. నాగేశ్వరరావు భార్య, కూతురు కు సంబందం ఉన్న ఓ కంపెనీ, సాల్ట్లేక్లో ఆయన భార్య ఆధ్వర్యంలో నడుస్తున్న ఏంజెలినా మెర్సంటైల్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ లపై ఈ దాడులు జరిగాయి. tags : west bengal, raids