తెల్లవారేసరికల్లా ప్రధాని మోడీని తిడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడినట్లు లీక్ లు భలే వస్తుంటాయి.తాజాగా మోడీకి దేశం అంతటా తెలిసిలా నిరసనలు తెలపాలని ఆయన పిలుపు ఇచ్చారు.విభజన గాయంపై కారం చల్లి మోడీ పైశాచిక ఆనందం పొందుతున్నారని ఆయన అన్నారు.మోడీ ప్రస్టేషన్ లో ఉన్నారని, రేపు గుంటూరు వచ్చి ప్రస్టేషన్ లో మాట్లాడతారని ఆయన అన్నారు. రాష్ట్రానికి అన్యాయం చేసిన వ్యక్తి ఏపీ వచ్చారని దేశమంతా తెలిసేలా నిరసనలు తెలపాలని ఆయన పార్టీకి పిలుపు ఇచ్చారు. . అంతా పసుపు చొక్కాలు ధరించి ఎక్కడికక్కడ నిరసనలు తెలపాలని కోరారు. గాంధీజీ స్పూర్తితో రేపు, ఎల్లుండి ఒక చీకటి దినంగా భావించి కసి పట్టుదలతో అందరూ నిరసనలు తెలపాలని సూచించారు. tags : chandrababu, modi,frustration