A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఇలా చేసి బాబు ప్రజాభిప్రాయాన్ని మార్చగలరా
Share |
August 21 2019, 6:22 am

ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు తాజాగా వచ్చిన సర్వే తర్వాత మరింత భయం పట్టుకున్నట్లు స్పష్టంగా కనిపిస్తుంది.తాజాగా వచ్చిన టైమ్స్ నౌ సర్వే ప్రకారం వైఎస్ ఆర్ కాంగ్రెస్ కు 23 లోక్ సభ సీట్లు వస్తే,తెలుగుదేశం పార్టీకి కేవలం రెండే వస్తాయి. ఈ సర్వేతో మరింత బెంబేలెత్తిపోతున్న చంద్రబాబు నాయుడు తన శక్తియుక్తులన్నిటిని ప్రయోగించి ప్రజాభిప్రాయాన్ని మార్చాలని విశ్వయత్నం చేస్తున్నారు. అందులో భాగంగా వృద్దాప్య పెన్షన్ లను స్వయంగా పంచే కార్యక్రమం చేపట్టి,అదేదో పండగలా అంతా అనుకోవాలని ఆయన తాపత్రయపడుతున్నారు.ప్రతి నెల ఇచ్చే పధకాన్ని వైఎస్ ఆర్ కాంగ్రెస్ అదినేత జగన్ పుణ్యమా అని మరో వెయ్యి పెంచి ఇస్తున్నారు.దానికి పెద్ద హడావుడి.ప్రతి నియోజకవర్గంలో ఈ సభలు.వాటిలో వృద్దులు సొమ్మసిల్లిపోయేలా చంద్రబాబు కాని, ఇతర టిడిపి నేతలు కాని స్పీచ్ లు ఇవ్వడం..వివిధ ప్రాంతాలలో ఈ బాధ తాళలేక ముగ్గురు చనిపోయారని వార్తలు వచ్చాయి.ఈ పెన్సన్ల పొందిన వారు మళ్లీ టిడిపికే ఓటు వేయాలని ఒట్లు వేయించుకునే నీచ సంస్కృతికి కూడా కొన్ని చోట్ల టిడిపి నేతలు దిగజారుతున్నారట. సీనియర్ నేత శత్రుచర్ల విజయరామరాజు టిడిపిలో చేరాక ఏదేదో మాట్లాడుతూ చివరికి నోట్లో పురుగులు వరకు వెళ్లారు. ఇవన్ని ఏమి సూచిస్తున్నాయి. చంద్రబాబు కాని,ఆయన పార్టీ నేతలు కాని విపరీతంగా భయపడిపోతున్నారని అర్ధం కావడం లేదూ! ఒక్క మాటకు చంద్రబాబు జవాబు చెబితే మనం ఒప్పుకోవచ్చు. వైఎస్ఆర్ కాంగ్రెస్ అదినేత జగన్ తన పాదయాత్రలో తాము అదికారంలోకి రాగానే పెన్షన్ రెండువేల రూపాయలు చేస్తామని చెప్పారా?లేదా అప్పుడు దానిని టిడిపి నేతలు విమర్శించారా?లేదా?ఇప్పుడు ఎన్నికల ముందు హడావుడిగా ఓటమి భయంతో తాము రెండువేలు ఇస్తామని చెప్పి ,పెన్షన్ లతో పాటు ప్రభుత్వ ప్రచారం కింద కోట్ల రూపాయలు ఎందుకు ఖర్చు చేయడం దారుణంగా ఉంటుంది.జగన్ పెన్షన్ పెంపుదల హామీ ఇవ్వకపోయి ఉంటే చంద్రబాబు వీటిని పెంచేవారా?ఇప్పుడు తానే పెంచానని చెప్పినా, ఆ తర్వాత వైఎస్ ఆర్ కాంగ్రెస్ అదికారంలోకి వస్తే వారు కూడా కొనసాగించడమే కాకుండా, మరికొంత పెంచుతామని చెబుతున్నారు కదా..అప్పుడు పెన్షన్ పెందుతున్నవారు టిడిపికి ఎందుకు ఓటు వేస్తారు?నిజానికి చం్రబాబు ఎన్నికల హామీలో చెప్పినవాటిని సరిగా చేసి ఉంటే ఇప్పుడు ఆయనకు ఇన్ని సమస్యలు వచ్చేవి కావు. జన్మభూమి కమటీలపేరుతో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసి వాటి ద్వారానే పెన్షన్ దారులు కూడా పెన్షన్ పొందాలని దిక్కుమాలిన షరతు పెట్టడం నేరమా?కాదా? దేశంలో ప్రజాస్వామ్యం లేకుండా పోయిందని ప్రదాని మోడీని విమర్శిస్తూ కాంగ్రెస్ అదినేత రాహుల్ గాంధీ పక్కన కూర్చుంటే ప్రజాస్వామ్యవాది అయిపోతారా?అంతేకాదు. మోడీ రైతులకు ఇస్తున్న సాయం ఆరువేలను లెక్కించి ఎకరాకు ఐదువందల ముష్టి వేస్తారా అని చంద్రబాబు ప్రశ్నించారు. ఇది వినడానికి బాగానే ఉంది.కాని చంద్రబాబు పెన్షన్ ల పేరుతో ఇంతకాలం నెలకు వెయ్యి రూపాయల చొప్పున ఇచ్చారు.అంటే రోజుకు ముప్పైమూడు రూపాయలా?దాంతో ఎవరైనా జీవించగలరా?చంద్రబాబు వేసింది ముస్టి కాదా అని ఎవరైనా ప్రశ్నిస్తే ఆయన ఏమి జవాబు చెబుతారు?చంద్రబాబు కాని, టిడిపి మీడియా కాని తమాసాలు చేస్తున్నారు. మోడీ బొమ్మవేసి ఎందాక ఈ పందారం అని ప్రశ్నించిన ఒక టిడిపి మీడియా మొదటి పేజీలో చంద్రబాబు పెన్షన్ ల పంపిణీని పండగగా అబివర్ణించి పులకరించి పోయింది. మరి చంద్రబాబు సడన్ గా డ్వాక్రా మహిళలకు పసుపు కుంకుమ పేరుతో పదివేల రూపాయలను పోస్ట్ డేటెడ్ చెక్ లుగా ఇస్తే అది మాత్రం గొప్ప విషయంగా ఆ మీడియాకు కనిపిస్తోంది. ఎదుటివారికి చెప్పేటందుకే నీతులు అన్న చందంగా తయారయ్యారు.ఏది ఏమైనా వృద్దాప్య పెన్షన్ ల పెంపుదల పేరుతో మూడు రోజుల పాటు రాష్ట్రం అంతా ప్రచారం చేసి ఎలాగొలా వారినైనా ఆకట్టుకోవాలన్న చంద్రబాబు ప్రయత్నం సఫలం అవుతుందా?అంటే సందేహమే.ఎందుకంటే వైఎస్ ఆర్ కాంగ్రెస్ గెలిస్తే జగన్ ముఖ్యమంత్రి అయితే ఆయన ఈ స్కీమును కొనసాగిస్తారు.అంతేకాక జన్మభూమి కమిటీల పీడ ఈ వృద్దులకు లేకుండా పోతంఉంది కదా.ప్రభుత్వ పదకాలు ప్రజల డబ్బుతో ఇచ్చేవే.కనుక ఆ స్కీమ్ పొందడం ప్రజల హక్కు అయితే ఓటును ఎవరైనా బలవంతంగా పలానా పార్టీకి వేయాలని చెబితే ,ఒట్లు వేయించే దిక్కుమాలని చర్యలకు పాల్పడితే,ఆ ఒట్లను ప్రజలు గట్టుమీద పెట్టి తమకు నచ్చిన వారికి ఓటు వేసుకోవచ్చు.ఏ నేత తమ ఇంటిలో నుంచి డబ్బు ఇవ్వరు.కనుక అలాంటి ఒట్లకు విలువ ఉండదు. స్వేచ్చగా వారు ఓటు వేసుకోవచ్చు. అదే ప్రజాస్యామ్య విజయం కూడా.ఆంద్ర సమాజాన్ని అమ్ముడు పోయే సరుకుగా మార్చాలని టిడిపి ప్రయత్నిస్తోంది. ఆంద్రులది ఆత్మగౌరవ సమాజం తప్ప, అమ్ముడుపోయేది కాదని రుజువు చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది.

tags : ap, public opinion

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info