A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ప్రభుత్వ ఆఫీస్ లో నోములకు ఎదురైన అనుభవం
Share |
April 25 2019, 1:40 am

నాగార్జున సాగర్ ఎమ్మెల్యే నోముల నరసింహయ్య కు ఆశ్చర్యకరమైన అనుభవం ఎదురైంది.ఆయన తన నియోజకవర్గంలోని హాలియా మండలంలోని తాసిల్దార్ కార్యాలయానికి ఆకస్మికంగా వెళ్లారు. తీరా చూస్తే అక్కడ ఒక్క ఉద్యోగి కూడా లేరట. 12.30 గంటలకు కాని ఒక ఉద్యోగి రాలేదట.అతను వచ్చి ఏదో వివరణ ఇవ్వబోగా ,నరసింహయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. అదికారులు,సిబ్బంది నిర్లక్ష్యం వల్ల ప్రజలకు అసౌకర్యం కలుగుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.దీనిపై జిల్లా కలెక్టర్ కు పిర్యాదు చేస్తానని అన్నారు. ఆ తర్వాత ప్రభుత్వ ఆస్పత్రిని కూడా సందర్శించి,అక్కడి పరిస్థితిని పరిశీలించారు.

tags : nomula

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info