A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
బాలకృష్ణ,పవన్ లు కేసిఆర్ ను కలవవచ్చా
Share |
August 26 2019, 2:30 pm

తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ను తమ ప్రయోజనాల కోసం బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ వంటి వారు కలవవచ్చు కాని, రాష్ట్ర ప్రయోజనాల కోసం కెటిఆర్, జగన్ లు కలిస్తే తప్పేమిటని మాజీ ఎమ్మెల్యే , వైఎస్ ఆర్ కాంగ్రెస్ నేత కాటసాని రాంభూపాల్ రెడ్డి ప్రశ్నించారు. తెలుగుదేశం నేతలు ఎందుకు గగ్గోలు పెడుతున్నారని ఆయన అన్నారు. చంద్రబాబు డైరెక్షన్‌లో నడవాల్సిన అవసరం తమకు లేదని స్పష్టం చేశారు. ప్రత్యేక హోదా కోసమే ఫెడరల్‌ ఫ్రంట్‌తో జతకడుతున్నామని తెలిపారు. ఫెడరల్‌ ఫ్రంట్‌ గురించి మాట్లాడితే టీడీపీ నాయకులు ఎందుకు ఉల్కిపడుతున్నారంటూ నందికోట్కూర్‌ ఎమ్మెల్యే ఐజయ్య ప్రశ్నించారు. పక్క రాష్ట్రాలతో స్నేహంగా ఉండటం కోసమే ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పొత్తు లేకుండా ఎన్నికల్లో పోటీ చేయలేని అసమర్థుడు చంద్రబాబు నాయుడంటూ విమర్శించారు. పవన్‌ కళ్యాణ్‌ మళ్లీ టీడీపీతో జతకడుతున్నాడని ఆరోపించారు.

tags : ysr congress, babu, pawan

Latest News
*చిదంబరం కు బెయిల్ నిరాకరణ
*ఎపి గవర్నర్ భార్యకు మోకాళ్ల ఆపరేషన్
*42 రోజుల తర్వాత ప్రత్యక్షమైన ప్రతిపక్ష నేత
*జనతా -జనార్దన్ తెలంగాణ ప్రభుత్వ కొత్త యాప్
*అమరావతే టిడిపిని ముంచింది
*పోలవరం నిర్మాణంలో మార్పులు లేవు-జివిఎల్
*కాంగ్రెస్ ఎమ్.పి పాదయాత్రకు అనుమతి నో
*రాజదాని ఏ ఒక్క సామాజికవర్గానికో కాదు
*కెసిఆర్ తో చేతులు కాల్చుకోవద్దు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info