A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఈ చంద్రబాబు మాకొద్దంటున్నారు
Share |
February 19 2019, 7:47 am

ఈ బాబు మాకు వద్దు అని ఎపి లో ముఖ్యమంత్రి చంద్రబాబుకు వ్యతిరేకంగా ప్రజలు చాలా స్పష్టంగా చెబుతున్నారని టిఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస యాదవ్ అన్నారు. చంద్రబాబును ఓడించడానికి ఎన్.టి.ఆర్.అబిమానులు సిద్దంగా ఉన్నారని ఆయన అన్నారు.
ఏపీ హక్కుల కోసం టీఆర్‌ఎస్‌ పార్టీ పోరాడుతుందని తెలిపారు. లోటు ఆదాయంలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో నవనిర్మాణ దీక్ష పేరిట టీడీపీ ప్రభుత్వం వందల కోట్ల రూపాయలు వృథా చేస్తోందని విమర్శించారు. తమ పార్టీ పబ్లిసిటీ కోసం ప్రజల సొమ్మును దుర్వినియోగం చేస్తున్న చంద్రబాబుకు బుద్ధి చెప్పేందుకు.. ‘ఈ బాబు మాకొద్దు’ నినాదంతో ఏపీ ప్రజల ముందుకు ధైర్యంగా వెళ్తామని తలసాని పేర్కొన్నారు. శవరాజకీయాలు చేసే చంద్రబాబు తాటాకు చప్పుళ్లకు ఎవరూ భయపడరని తలసాని అన్నారు.

tags : talasani, babu, ap

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info