A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఎన్.టి.ఆర్.సినిమా నష్టాలు ఎవరికి!
Share |
August 26 2019, 2:38 pm

ప్రఖ్యాత నటుడు , మాజీ ముఖ్యమంత్రి ఎన్.టి.రామారావు జీవిత చరిత్రపై తీసిన సినిమా భారీ నష్టాలు చవి చూసిందని వార్తలు వస్తున్నాయి.ఎన్.టి.ఆర్.కధానాయకుడు సినిమా బాగా ఆడుతుందని అంతా ఆశించారు. కాని వివిద కారణాల వల్ల అలా జరగలేదు.ఒక కదనం ప్రకారం ఎన్టీఆర్‌ సినిమాను దాదాపు రూ. 70 కోట్లకు అమ్మారట. కాని ఈ సినిమాకు తొలి రోజు నుంచి డివైడ్‌ టాక్‌ రావటంతో కలెక్షన్ల ఆశించిన స్థాయిలో రాలేదు. సంక్రాంతి సెలవులను కూడా యన్‌.టి.ఆర్‌ క్యాష్‌ చేసుకోలేకపోయింది.గత బుధవారం రిలీజ్‌ అయిన ఈ సినిమా తొలి వారాంతానికి ఇంకా రూ. 20 కోట్ల మార్క్‌ షేర్‌ కూడా సాధిం‍చలేదని ఇంటర్‌నేషనల్‌ బిజినెస్ టైమ్స్‌ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం తెలుస్తోందని మీడియాలో వార్తలు వచ్చాయి. ఈ పరిస్థితుల్లో యన్‌.టి.ఆర్‌ కథానాయకుడు బ్రేక్‌ ఈవెన్‌ సాధించటం సాధ‍్యమేనా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఈ నేపథ్యంలో యన్‌.టి.ఆర్‌ కథానాయకుడు భారీ డిజాస్టర్‌గా మిగిలే అవకాశలే ఎక్కువగా ఉన్నాయన్న టాక్‌ వినిపిస్తోందని ఆ కదనం చెబుతోంది.నిజంగా అంత నష్టం వస్తుందా?అది ఎవరికి నిర్మాతకు వస్తుందా?లేక కొనుగోలుదారులకా?అసలు ఆ సినిమా నిర్మాణానికి ఎంత ఖర్చు అయిందో? దీనివల్ల నష్టపోయేది ఎవరన్నది ప్రశ్న. ప్రముఖ నటుడు బాలకృష్ణ ఈ సినిమాలో ఎన్.టి.ఆర్.పాత్రను పోషించిన సంగతి తెలిసిందే.

tags : ntr, losses

Latest News
*చిదంబరం కు బెయిల్ నిరాకరణ
*ఎపి గవర్నర్ భార్యకు మోకాళ్ల ఆపరేషన్
*42 రోజుల తర్వాత ప్రత్యక్షమైన ప్రతిపక్ష నేత
*జనతా -జనార్దన్ తెలంగాణ ప్రభుత్వ కొత్త యాప్
*అమరావతే టిడిపిని ముంచింది
*పోలవరం నిర్మాణంలో మార్పులు లేవు-జివిఎల్
*కాంగ్రెస్ ఎమ్.పి పాదయాత్రకు అనుమతి నో
*రాజదాని ఏ ఒక్క సామాజికవర్గానికో కాదు
*కెసిఆర్ తో చేతులు కాల్చుకోవద్దు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info