A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఎపి డిజిపి నియామకం చెల్లుతుందా
Share |
April 20 2019, 7:53 pm

రాష్ట్ర ప్రభుత్వాలు డిజిపి ఎంపిక విషయంలో సొంత చట్టాలు ,సొంత నిర్ణయాలు చేయడం సరికాదని సుప్రింకోర్టు తీర్పు ఇచ్చిన నేపధ్యంలో ఎపి,తెలంగాణలలో కూడా దాని ప్రబావం ఉంటుందని కధనాలు వస్తున్నాయి. ఎపి డిజిపి ఠాకూర్ నియామకం ఏమి అవుతుందా అన్న చర్చ జరుగుతోంది. తమ సొంత చట్టాల ద్వారా డీజీపీ నియామకానికి అనుమతించాలని కోరుతూ పంజాబ్, హరియాణా, కేరళ, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్ర ప్రభుత్వాలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. రాష్ట్రాల సొంత చట్టాల ద్వారా డీజీపీ నియామకాలు చెల్లవని సుప్రింకోర్టు తాజా తీర్పులో
స్పష్టం చేసింది. అధికారంలో ఉన్న పార్టీ రాజకీయ జోక్యంతోపాటు ప్రజల రక్షణను దృష్టిలో ఉంచుకునే రాష్ట్రాల సొంత చట్టాల ద్వారా డీజీపీ నియామకం చెల్లదని గతంలో సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చిందని జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌ గుర్తుచేశారు. అలాగే యాక్టిం గ్‌ డీజీపీ నియమాకాలను కూడా రాష్ట్ర ప్రభుత్వాలు చేయరాదని పేర్కొన్నారు. యాక్టింగ్‌ డీజీపీ పేరుతో వారి పదవీ కాలాన్నీ ఏళ్ల తరబడి పొడిగిస్తున్నారని, ఇది ఎంతమాత్రం భావ్యం కాదని తేల్చిచెప్పారు. రాష్ట్రాల డీజీపీ నియమాకానికి సీనియారిటీ మేరకు వారి సర్వీసులోని అంశాలను జోడించి ముగ్గురు పేర్లను యూనియన్‌ పబ్లిక్‌ సర్వీసు కమిషన్‌కు(యుపీఎస్సీ) పంపించాల్సి ఉందని, అందులో నుంచి ఒకరిని యూపీఎస్సీ ఎంపిక చేస్తుందని, అలా ఎంపిక చేసిన వ్యక్తిని డీజీపీగా రాష్ట్రాలు నియమించాల్సి ఉంటుందని జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌ తన తీర్పులో వెల్లడించారు.

చంద్రబాబు సొంత చట్టం
2006లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మేరకు యూపీఎస్సీ ద్వారానే డీజీపీని నియమించాల్సి ఉంటుంది. యూపీఎస్సీకి మూడు పేర్లు పంపిస్తే తనకు కావాల్సిన వారిని, రాజకీయంగా ఉపయోగపడే వ్యక్తిని డీజీపీగా నియమించుకోవడం సాధ్యం కాదని ముఖ్యమంత్రి చంద్రబాబు భావించారు. అందుకే డీజీపీ ఎంపిక ప్రక్రియను యూపీఎస్సీ నుంచి తప్పించేందుకు ఏకంగా చట్టంలో సవరణలు తీసుకొచ్చారు. రాష్ట్ర సొంత చట్టం మేరకే డీజీపీని నియమించాలని నిర్ణయించారు. 2018 జూన్‌ 30వ తేదీన యాక్టింగ్‌ డీజీపీగా పనిచేస్తున్న మాలకొండయ్య పదవీ విరమణ చేశారు. ఆయన పదవీ విరమణ చేసే చివరి నిమిషం వరకూ కొత్త డీజీపీ ఎవరనేది చంద్రబాబు తేల్చలేదు. చివరి నిమిషంలో ఐదుగురు పేర్లతో సీనియారిటీ జాబితా రూపొందించినట్లు కథ నడిపించారు. గౌతమ్‌ సవాంగ్, ఆర్పీ ఠాకూర్, కౌముది, సురేంద్రబాబు, అనూరాధ పేర్లతో సీనియారిటీ జాబితా రూపొందించామని, అందులో నుంచి ఆర్పీ ఠాకూర్‌ను డీజీపీగా నియమించినట్లు తెలిపారు. వాస్తవానికి గౌతమ్‌ సవాంగ్‌ డీజీపీ అవుతారని అందరూ భావించారు. ఆయన రాజకీయంగా ఉపయోగపడరనే ఉద్దేశంతోనే ఆర్పీ ఠాకూర్‌ వైపు చంద్రబాబు మొగ్గుచూపినట్లు సమాచారం. తాజాగా సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో డీజీపీగా ఠాకూర్‌ నియమాకం చట్ట విరుద్ధమే అవుతుందని, దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందో వేచి చూడాల్సి ఉందని ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు వ్యాఖ్యానించారని కదనం.

tags : ap, dgp,

Latest News
*చంద్రబాబు ఇవ్వాళ కూడా ఈ ట్వీట్ ఇవ్వాలా
*లక్ష్మీనారాయణకు మళ్లీ విజయసాయి కౌంటర్
*చంద్రబాబుకు ఈనాడు పొగడ్తల జల్లు
*లక్ష్మీనారాయణ వ్యాఖ్య- నిజంగా దర్మంగా చేశారా
*కర్నాటక ప్రజల చెవిలో చంద్రబా బు పూలు
*మోడీలో ఆ లక్షణాలు లేవంటున్న విజయశాంతి
*ముఖ్యమంత్రి పగటి కలలు కంటున్నారు
*ఈ ప్రభుత్వమే పోతుంది.. భయపడవద్దు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info