A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
అమరావతిలో ఆ 5 కంపెనీలదే హవా
Share |
February 19 2019, 8:01 am

ఎపి రాజధాని లో మొత్తం కాంట్రాక్టులలో అత్యధికం ఐదు కంపెనీలకే అప్పగిస్తున్నారని ఒక కదనం వచ్చింది.ఇంతవరకు ఈ ఐదు కంపెనీలకు ఈ నాలుగున్నరేళ్లలో 25వేల కోట్లకుపైగా కాంట్రాక్టులు ఇచ్చారు. ఈ కంపెనీలకు ఉన్న అర్హతల ఆదారంగా టెండర్లు నిబంధనలు తయారు చేయడం ఎపి ప్రభుత్వం ప్రత్యేకతగా ఉందని ఆ కధనం వివరించింది.వీటికి చదరపు అడుగుకు ఏడు వేల రూపాయల నుంచి పది వేల రూపాయల వరకు చెల్లిస్తుంటారట. ప్రతిపాదనల దశలోనే ముఖ్యమంత్రి నోటి మాటతో వందల కోట్ల రూపాయల పనుల్ని ఈ సంస్థలు చేజిక్కించుకుంటున్నాయి. కొన్ని కీలక ప్రాజెక్టుల ప్రతిపాదనలైతే ఆ ఐదు సంస్థలే తయారుచేసి ముఖ్యమంత్రి ఎదుట పెడుతుండగా.. ఆయన ఆమోదముద్ర వేసి వాటికే నిర్మాణ బాధ్యతల్ని అప్పగిస్తుండడం గమనార్హం. ఎల్‌ అండ్‌ టీ, ఎన్‌సీసీ, షాపూర్‌జీ పల్లోంజి, బీఎస్‌ఆర్‌ ఇన్‌ఫ్రా కంపెనీలకు 80 శాతానికిపైగా పనులు కేటాయించగా మిగిలిన పనుల్ని బీఎస్‌సీపీఎల్, మేఘ ఇంజినీరింగ్‌ కంపెనీలకు అప్పగించారు.
ఇప్పటివరకూ రూ.39,875 కోట్ల విలువైన పనుల్ని చేపట్టినట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించగా.. అందులో ఒక్క ఎల్‌ అండ్‌ టీ సంస్థకే రూ.8 వేల కోట్లకు పైగా పనుల్ని కట్టబెట్టారు. వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయాన్ని ఈ సంస్థే నిర్మించగా.. ఇటీవలే మొదలైన శాశ్వత సచివాలయంలోని మూడు, నాలుగు టవర్లు, కృష్ణానదిపై ఐకానిక్‌ బ్రిడ్జి, తాత్కాలిక హైకోర్టు భవన నిర్మాణంతోపాటు రెండు భూ సమీకరణ లేఅవుట్ల అభివృద్ధి ప్రాజెక్టులు, పలు రోడ్ల ప్రాజెక్టులనూ ఎల్‌ అండ్‌టీ కే అప్పగించారు.

tags : amaravati, projects

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info