విపక్ష నేత జగన్ పై విశాఖపట్నం విమానాశ్రయంలో జరిగిన హత్యాయత్నం కేసుపై మరసారి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడారు. జగన్ అబిమానే కోడికత్తితో దాడి చేశాడని , ఆ కేసులో ఏముందని ప్రశ్నించారు. మాజీ మంత్రి అహ్మదుల్లా టిడిపిలో చేరిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ కేసు విచారణను ఎన్.ఐ.ఎ.కి అప్పగించడం రాష్ట్రాల హక్కులను హరించడమేనని ఆయన అన్నారు. రాష్ట్రాల హక్కులను హరిస్తే కేంద్రాన్ని వదలిపెట్టేది లేదని ఆయన హెచ్చరించారు.ఎన్నికలకు కేవలం వంద రోజుల సమయం మాత్రమే ఉందన్నారు. ఇంటికి ఒకరు చొప్పున టీడీపీ కోసం ప్రచారం చేయాలని.. 25 లోక్సభ స్థానాల్లోనూ టీడీపీనే గెలిపించాలని కోరారు. tags : chadnrababu, jagan,attack,