A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
జగన్ కేసు- హర్షవర్దన్ చౌదరి పత్తా లేడు
Share |
August 26 2019, 3:14 pm

విపక్ష నేత ,వైఎస్ ఆర్ కాంగ్రెస్ అదినేత జగన్ పై విశాఖ విమానాశ్రయంలో జరిగిన హత్యాయత్నం కేసులో ఎయిర్ పోర్టు హోటల్ యజమాని హర్షవర్దన్ చౌదరి గత కొద్ది రోజులుగా కనిపించడం లేదట. పైగా అతని పోన్ స్విచ్ ఆఫ్ అయి ఉంటోందని సమాచారం.ఈ కేసును విచారిస్తున్న జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్.ఐ.ఎ) హర్షవర్దన్ చౌదరికి నోటీసు ఇచ్చి విచారణకు రావాలని కోరింది. గురువారం నాడు అతను రావల్సి ఉన్నా, హాజరు కాలేదు.అతను ఎక్కడికి వెళ్లింది తెలియడం లేదని అంటున్నారు. కాగా ఎన్.ఐ.ఎ. విచారిస్తున్న సాక్షులను ప్రభావితం చేసేందుకు కొందరు టిడిపి నేతలు,కొంతమంది అధికారులు ప్రయత్నాలు సాగిస్తున్నారు.విచారణకు వెళ్లి సాక్షులలో కొందరికి వీరు ట్రైనింగ్ కూడా ఇస్తున్నారట.హత్యాయత్నం జరిగిన గతేడాది అక్టోబర్‌ 25న ఘటనాస్థలంలో ఉన్న వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలను కూడా సాక్షులుగా పేర్కొంటూ నోటీసులు పంపగా.. వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో పనిచేసే కృష్ణకాంత్, మాజీ కార్పొరేటర్‌ జియ్యాని శ్రీధర్‌ 2 రోజులక్రితం హాజరయ్యారు.నోటీసులందుకున్న మిగతా వైఎస్సార్‌సీపీ నేతలు సైతం 2 రోజుల్లో విచారణకు హాజరవుతామని సమాచారమిచ్చారు. అయితే ఈ కేసులో కీలకంగా భావిస్తున్న టీడీపీ నేత, ఎయిర్‌పోర్ట్‌లోని ఫ్యూజన్‌ ఫుడ్స్‌ రెస్టారెంట్‌ యజమాని హర్షవర్ధన్‌ చౌదరి మాత్రం పత్తా లేకుండా పోయారని కదనం. నిజానికి ఫ్యూజన్‌ ఫుడ్స్‌ రెస్టారెంట్‌ కేంద్రంగానే కుట్ర జరిగిందని, హర్షవర్ధన్‌ చౌదరికి తెలియకుండా శ్రీనివాసరావు.. వైఎస్‌ జగన్‌పై హత్యాయత్నం చేసేంతటి ఘాతుకానికి తెగబడడన్న వాదనలు బలంగా వినిపించినా.. పోలీసులు, సిట్‌ అధికారులు హర్షవర్ధన్‌ జోలికే పోలేదు.
ప్రభుత్వ పెద్దల అండతోనే హర్షవర్ధన్‌ పత్తా లేకుండా పోయారన్న వాదన వినిపిస్తోంది. దీనిపై ఎన్‌ఐఏ వర్గాలు మాట్లాడుతూ.. ఒకటి, రెండు రోజులు చూసి అప్పటికీ హర్షవర్ధన్‌ విచారణకు రాకుంటే ఏం చేయాలో నిర్ణయిస్తామని చెప్పాయి.

tags : jagan, harshavardha,nia,address

Latest News
*4 రాజధానులా..క్లారిటీ ఇవ్వండి -టిడిపి
*పోలవరం పనులు రాష్ట్రమే కొనసాగిస్తుంది
*చిదంబరం కు బెయిల్ నిరాకరణ
*ఎపి గవర్నర్ భార్యకు మోకాళ్ల ఆపరేషన్
*42 రోజుల తర్వాత ప్రత్యక్షమైన ప్రతిపక్ష నేత
*జనతా -జనార్దన్ తెలంగాణ ప్రభుత్వ కొత్త యాప్
*అమరావతే టిడిపిని ముంచింది
*పోలవరం నిర్మాణంలో మార్పులు లేవు-జివిఎల్
*కాంగ్రెస్ ఎమ్.పి పాదయాత్రకు అనుమతి నో
*రాజదాని ఏ ఒక్క సామాజికవర్గానికో కాదు
*కెసిఆర్ తో చేతులు కాల్చుకోవద్దు
*యరపతినేని అక్రమ మైనింగ్ పై సిబిఐ
*లోకేష్,బ్రాహ్మణిల పెళ్లిరోజు-ట్వీట్ ఆసక్తిగా ఉంది.
*మాజీ ప్రదాని మన్మోహన్ సింగ్ భద్రత తొలగింపు
*ఈ దుర్మార్గాల నుంచి జగన్ కాపుకాసుకోవల్సిందే
*కెటిఆర్ కు మంత్రి పదవి-పెరుగుతున్న స్వరం
*సిబిఐ విచారణకు మాజీ సిఎమ్. వెళ్లాల్సిందేనా
*ఇక వర్షం కోసం ఎదురు చూడనక్కర్లేదు
*బిజెపిపై తీవ్ర వ్యాఖ్య
*పోలవరం కేంద్రానికి -టిడిపి మీడియా
*టిజి వెంకటేష్ వాదన ఏమిటంటే..
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info