A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
చంద్రబాబుకు వైసిపి సూటి ప్రశ్న
Share |
August 26 2019, 2:28 pm

ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కు మాజీ మంత్రి, వైఎస్ ఆర్ కాంగ్రెస్ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ సూటి ప్రశ్న వేశారు. బావమరిది హరికృష్ణ భౌతికకాయాన్ని పక్కన పెట్టుకుని టీఆర్‌ఎస్‌ పొత్తుకు ప్రయత్నించినప్పుడు రాష్ట్ర హక్కులు, కేసీఆర్‌ తిట్లు, శాపనార్థాలు సీఎం చంద్రబాబుకు గుర్తుకురాలేదా? అని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ జతకట్టేందుకు ప్రయత్నించి భంగపడ్డ చంద్రబాబు ఇప్పుడు అదే పార్టీతో ఏపీలో వైఎస్సార్‌సీపీ పొత్తు పెట్టుకుంటోందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. బాబుది నాలుకా? తాటిమట్టా? అని ద్వజమెత్తారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ స్వతంత్రంగానే అన్ని సీట్లకు పోటీ చేస్తుందని, ఏ పార్టీతోనూ పొత్తులుండబోవని స్పష్టం చేశారు. చంద్రబాబుకు రాజకీయ ప్రయోజనాలే తప్ప రాష్ట్ర ప్రయోజనాలపై ఆసక్తి లేదని ధ్వజమెత్తారు. ఏపీలో లేని పార్టీలతో పొత్తులు, పొడుపులు ఏమిటని ఎల్లో మీడియాను ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్‌ భవిష్యత్తు కోసం శ్రమిస్తున్న వైఎస్సార్‌సీపీపై నిందలు వేయడం దారుణమని ఆయన అన్నారు..

tags : botsa, babu, question

Latest News
*చిదంబరం కు బెయిల్ నిరాకరణ
*ఎపి గవర్నర్ భార్యకు మోకాళ్ల ఆపరేషన్
*42 రోజుల తర్వాత ప్రత్యక్షమైన ప్రతిపక్ష నేత
*జనతా -జనార్దన్ తెలంగాణ ప్రభుత్వ కొత్త యాప్
*అమరావతే టిడిపిని ముంచింది
*పోలవరం నిర్మాణంలో మార్పులు లేవు-జివిఎల్
*కాంగ్రెస్ ఎమ్.పి పాదయాత్రకు అనుమతి నో
*రాజదాని ఏ ఒక్క సామాజికవర్గానికో కాదు
*కెసిఆర్ తో చేతులు కాల్చుకోవద్దు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info