A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
5గురు హీరోయిన్ లపై దుష్ప్రచారం
Share |
August 26 2019, 3:17 pm

సినీ తారలు, నాయకులు, కార్పొరేట్‌ సంస్థలే లక్ష్యం గా యూట్యుబ్ లో అసభ్య ప్రచారం జరుగుతున్న తీరుపై పోలీసుల విచారణలో పలు అంశాలు బయటకు వచ్చాయి.దీనిపై ఈనాడులో వచ్చిన ఒక కదనంలో పోలీసులు చెప్పిన విషయాలు ఉన్నాయి.విపక్ష నేత జగన్ సోదరి షర్మిల పై దుష్ప్రచారం మీద జరుగుతున్న విచారణ నేపద్యంలో ఈ విషయాలు బయటకు వచ్చాయట.అందులో ఒక భాగం ఇలా ఉంది.
యూట్యూబ్‌ వేదికగా సినీ తారలు, రాజకీయ నాయకులు, కార్పొరేటు సంస్థల ప్రతిష్ఠ దెబ్బతీసేలా వారి శత్రువులు అనుచరులతో వ్యతిరేక ప్రచారం చేస్తున్నారని పోలీసులు గుర్తించారు. ముఖ్యంగా పది మంది కథానాయకులు, ఐదుగురు కథానాయికలు, ముగ్గురు ప్రయోక్తల(టీవీ ఛానెళ్ల) వ్యక్తిగత విషయాలను దారుణంగా వక్రీకరిస్తున్నారని కొన్ని వీడియోల ద్వారా నిర్ధారణకు వచ్చారు. బాధితుల నుంచి గతంలో వచ్చిన ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకున్నారు. ఆ వీడియోల వెనుక బాధితుల/బాధిత సంస్థల వ్యతిరేకుల పాత్ర ఉండొచ్చని తొలుత భావించిన పోలీసులు ఆ జాబితాలను పరిశీలించే క్రమంలో విస్తుపోయే నిజాలు తెలుసుకున్నారు. ‘శత్రువులు అనుకున్న వారికి, యూట్యూబ్‌లో వీడియోలకు సంబంధం ఉండడం లేదు. ఎవరు చేశారో తెలుసుకునేందుకు ప్రయత్నించినా ప్రాథమిక ఆధారాలు లభించడం లేదు. గూగుల్‌ పరిశోధన సంస్థ ద్వారా ప్రయత్నిస్తే వీడియోలు, ఆడియోలు అప్‌లోడ్‌ చేస్తున్న వారి చిరునామాలు అమెరికా, ఆస్ట్రేలియాలో ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో దర్యాప్తు ముందుకు కదలడం లేదు. తాత్కాలికంగా యూట్యూబ్‌లో ఉన్న వ్యతిరేక ప్రచార వీడియోలను తొలగిస్తున్నాం’ అని పోలీసులు తెలిపారని ఆ కదనం వివరించింది.

tags : hyderabad,police, cyber crime

Latest News
*4 రాజధానులా..క్లారిటీ ఇవ్వండి -టిడిపి
*పోలవరం పనులు రాష్ట్రమే కొనసాగిస్తుంది
*చిదంబరం కు బెయిల్ నిరాకరణ
*ఎపి గవర్నర్ భార్యకు మోకాళ్ల ఆపరేషన్
*42 రోజుల తర్వాత ప్రత్యక్షమైన ప్రతిపక్ష నేత
*జనతా -జనార్దన్ తెలంగాణ ప్రభుత్వ కొత్త యాప్
*అమరావతే టిడిపిని ముంచింది
*పోలవరం నిర్మాణంలో మార్పులు లేవు-జివిఎల్
*కాంగ్రెస్ ఎమ్.పి పాదయాత్రకు అనుమతి నో
*రాజదాని ఏ ఒక్క సామాజికవర్గానికో కాదు
*కెసిఆర్ తో చేతులు కాల్చుకోవద్దు
*యరపతినేని అక్రమ మైనింగ్ పై సిబిఐ
*లోకేష్,బ్రాహ్మణిల పెళ్లిరోజు-ట్వీట్ ఆసక్తిగా ఉంది.
*మాజీ ప్రదాని మన్మోహన్ సింగ్ భద్రత తొలగింపు
*ఈ దుర్మార్గాల నుంచి జగన్ కాపుకాసుకోవల్సిందే
*కెటిఆర్ కు మంత్రి పదవి-పెరుగుతున్న స్వరం
*సిబిఐ విచారణకు మాజీ సిఎమ్. వెళ్లాల్సిందేనా
*ఇక వర్షం కోసం ఎదురు చూడనక్కర్లేదు
*బిజెపిపై తీవ్ర వ్యాఖ్య
*పోలవరం కేంద్రానికి -టిడిపి మీడియా
*టిజి వెంకటేష్ వాదన ఏమిటంటే..
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info