A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
చంద్రబాబు ఎందుకు వణుకుతున్నారు
Share |
February 19 2019, 7:43 am

వైఎస్‌ జగన్‌, కేటీఆర్‌ చర్చలు జరిపితే చంద్రబాబు ఎందుకు వణికిపోతున్నారో అర్థం కావడం లేదని వైఎస్ ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే రోజా అన్నారు. ప్రజల్లో అపోహలు సృష్టించి లబ్ధి పొందాలని టీడీపీ నాయకులు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు, టీడీపీ కారణంగానే ఆంధ్రప్రదేశ్‌కు నష్టం జరిగిందన్నారు. వైఎస్‌ జగన్‌ ఏది చేసినా బురద చల్లమే పనిగా పెట్టుకున్నారని టీడీపీ నాయకులపై మండిపడ్డారు.‘కేటీఆర్‌తో వైఎస్‌ జగన్‌ మాట్లాడమే తప్పు అంటున్నారు టీడీపీ నాయకులు. ఇద్దరు యంగ్‌ డైనమిక్‌ నాయకులు కలిస్తే ఎందుకు వణికిపోతున్నారు? హైదరాబాద్‌లో ఉండేందుకు పదేళ్లు గడువున్నా ఓటుకు కోట్లు కేసులో ఇరుక్కుని విజయవాడకు చంద్రబాబు పారిపోయి వచ్చారని అందరికీ తెలుసు. ఎంతసేపూ ఎవరితో పొత్తు పెట్టుకుందామా అని చంద్రబాబు ఆలోచిస్తుంటారు. మీరు ఎన్ని పార్టీలతో కలిసి వచ్చినా జగన్‌ సింగిల్‌గానే ఎన్నికలకు వస్తారు. రాష్ట్రానికి మంచి జరిగే విషయమైతే ఎవరితోనైనా జగన్‌ సంప్రదింపులు జరుపుతారు. జగన్‌ విశ్వసనీయతపై అందరికీ నమ్మకముంది. ఏపీకి నష్టం కలిగించిన కాంగ్రెస్‌, బీజేపీకి ప్రత్యామ్నాయంగా ఫెడరల్‌ ఫ్రంట్ పెడుతున్నారు. 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబుకు ఈ విషయం తెలియదా అని అన్నారు.

tags : roja, babu,fear

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info