A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
చంద్రబాబు ఎదురుదాడికి దిగుతారా
Share |
February 19 2019, 8:32 am

దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కుమార్తె షర్మిలపై సోషల్ మీడియాలో జరిగిన దుష్ప్రచారాన్ని ఖండించకపోగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎదురు దాడికి దిగుతున్నారని వైఎస్ ఆర్ కాంగ్రెస్ అదికార ప్రతినిది వాసిరెడ్డి పద్మ అన్నారు. టిడిపి నేతలే షర్మిలపై దుష్ప్రచారానికి ఒడికట్టారని ఆమె చెప్పారు. పోలీసులకు షర్మిల చేసిన ఫిర్యాదుపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఎదురుదాడికి దిగటం బాధాకరమన్నారు. షర్మిలపై సోషల్‌ మీడియాలో జరుగుతున్న దుష్ర్పచారం చంద్రబాబుకు తెలియదా అంటూ ప్రశ్నించారు. పోలీసుల విచారణలో ఆ పార్టీ వాళ్లు కచ్చితంగా బయటకు వస్తారన్నారు. టీడీపీ నేతలు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని, చంద్రబాబు బెదిరింపులకు దిగటం ఏంటని మండిపడ్డారు.షర్మిలకు అండగా ఉంటామని చంద్రబాబు కనీసం భరోసా ఇవ్వకపోవడం బాధకరం. ఆయన స్పందించిన తీరు దుర్మార్గం. ఇలాంటి ఘటనలే టీడీపీ నేతల ఇంట్లో వాళ్లకు జరిగితే ఇలాగే చేస్తారా? మిగతా మహిళల పరిస్థితి ఏంటి?.అని ఆమె అన్నారు.

tags : vasireddy, babu,

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info