A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఎపి హైకోర్టులో మూడు దర్మాసనాలు
Share |
August 26 2019, 3:02 pm

పరిపాలన సౌలభ్యం కోసం హైకోర్టులో మూడు బెంచ్ లను ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నట్లు తాత్కాలిక చీఫ్ జస్టిస్ ప్రవీణ్ కుమార్ తెలిపారు.ఈ నెల ఇరవైఒకటి నుంచి ఇవి అమలులోకి వచ్చే విదంగా ఆయన ఆదేశాలు జారీ చేశారు. సీజే, జస్టిస్‌ ఎం.సత్యనారాయణమూర్తితో మొదటి ధర్మాసనం ఏర్పాటైంది. ఇది పిల్‌, క్రిమినల్‌ కేసులు, హెబియస్‌ కార్పస్‌ వ్యవహారాలు, సుమోటో కేసులు, అన్ని రిట్‌ పిటిషన్లు తదితరాలను విచారిస్తుంది. జస్టిస్‌ ఎస్‌వీ భట్‌, జస్టిస్‌ ఎన్‌.గంగారావుతో ఏర్పాటైన ద్వితీయ ధర్మాసనం ఐటీ ట్రైబ్యునల్‌ అప్పీళ్లు, సెంట్రల్‌ ఎక్సైజ్‌, ఇన్‌కం ట్యాక్స్‌ కేసులు తదితరాలను విచారిస్తుంది. ఇక భూఆక్రమణలు, కుటుంబ వ్యవహారాలను జస్టిస్‌ ఏవీ శేషసాయి, జస్టిస్‌ జె.ఉమాదేవితో కూడిన ధర్మాసనం విచారించనుంది. మిగిలిన ఏడుగురు న్యాయమూర్తులు వేర్వేరుగా(సింగిల్‌ జడ్జిలు)గా కేసుల విచారణ లు చేపడతారు.

tags : ap, highcourt

Latest News
*పోలవరం పనులు రాష్ట్రమే కొనసాగిస్తుంది
*చిదంబరం కు బెయిల్ నిరాకరణ
*ఎపి గవర్నర్ భార్యకు మోకాళ్ల ఆపరేషన్
*42 రోజుల తర్వాత ప్రత్యక్షమైన ప్రతిపక్ష నేత
*జనతా -జనార్దన్ తెలంగాణ ప్రభుత్వ కొత్త యాప్
*అమరావతే టిడిపిని ముంచింది
*పోలవరం నిర్మాణంలో మార్పులు లేవు-జివిఎల్
*కాంగ్రెస్ ఎమ్.పి పాదయాత్రకు అనుమతి నో
*రాజదాని ఏ ఒక్క సామాజికవర్గానికో కాదు
*కెసిఆర్ తో చేతులు కాల్చుకోవద్దు
*లోకేష్,బ్రాహ్మణిల పెళ్లిరోజు-ట్వీట్ ఆసక్తిగా ఉంది.
*మాజీ ప్రదాని మన్మోహన్ సింగ్ భద్రత తొలగింపు
*ఈ దుర్మార్గాల నుంచి జగన్ కాపుకాసుకోవల్సిందే
*కెటిఆర్ కు మంత్రి పదవి-పెరుగుతున్న స్వరం
*సిబిఐ విచారణకు మాజీ సిఎమ్. వెళ్లాల్సిందేనా
*ఇక వర్షం కోసం ఎదురు చూడనక్కర్లేదు
*బిజెపిపై తీవ్ర వ్యాఖ్య
*పోలవరం కేంద్రానికి -టిడిపి మీడియా
*టిజి వెంకటేష్ వాదన ఏమిటంటే..
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info